
కల్తీ పాల కల్లోలంపై తేల్చిందేమంటే...
ఇది ఉద్దేశపూర్వకమైన కల్తీయా లేక నిల్వ సమస్య కారణమా అనేది ఇంకా ల్యాబ్స్ నిర్దారించలేదు
రాజమండ్రి (Rajamahendravaram)లో కల్తీ పాల (adulterated milk) ఘటన పూటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికి మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. కల్తీ పాలు తాగిన పెద్దలు, పిల్లలు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలు, సేకరణ కేంద్రాలు, చిల్లింగ్ సెంటర్లపై అధికారులు దాడులు జరుపుతున్నారు. మరోపక్క అసలు ఈ పాలల్లో ఏముందనేది ఇంకా నిర్ధారణ కాకముందే రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి.
ఫారెన్సిక్ ల్యాబ్ దర్యాప్తు
జిల్లా అధికారుల కధనం ప్రకారం, ఈ ఘటనా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాల, కంటైనర్లను విజయవాడ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపారు. సమగ్ర పరీక్షలు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఫ్రిజ్‌లోని ఒక కంటైనర్ కు చిల్లి పడిన కారణంగా కూలెంట్‌లోని monoethylene glycol లీకై పాలల్లో కలిసింది. దీంతో పాలు కలుషితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాల వ్యాపారి గణేష్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం పాలు, పెరుగు, వెన్న, జున్ను, వినిగర్ లాంటి పాల ఉత్పత్తుల నమూనాలను హైదరాబాద్, కాకినాడ ల్యాబ్‌లకు పంపి విశ్లేషణ జరుపుతోంది. పూర్తిస్థాయి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు ఖచ్చితమైన కారణం వెల్లడించలేమని అధికారులు తెలిపారు.
జిల్లాలో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్స్ కు పంపారు. ప్రాణహాని పదార్థాల స్థాయిను కనిపెడుతున్నారు. కిడ్నీ పనితీరు లాంటి వివరాల కోసం పరీక్షలు జరుపుతున్నారు. urea/creatinine లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని డాక్టర్లు చెప్పారు.
పాలకల్తీకి కారణమేంటీ...
ప్రాథమిక సమాచారం ప్రకారం, పాల సరఫరా చేసే ప్రదేశంలోని ఫ్రిజ్/చిల్లింగ్ యూనిట్ కూలెంట్ లీక్ అవ్వడం వల్ల పాలు కలుషితం అయ్యే అవకాశం ఉంది. ఇది ఉద్దేశపూర్వకమైన కల్తీయా లేదా నిల్వ సమస్య కారణమా అనే విషయాన్ని పూర్తి ల్యాబ్ నివేదిక తర్వాత మాత్రమే ఖచ్చితంగా తెలుతుంది.
రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పాలు అమ్మే గణేష్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాణాలు పాటించకుండా పాలను అమ్మకానికి పంపినట్లు గుర్తించారు. పాల సరఫరా చేసే వారిలో స్క్రీనింగ్ లోపం కారణంగా ఇది జరిగిందని అధికారులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరణించిన కుటుంబాలకు ₹10 లక్షల ఎక్స్‑గ్రేషియా ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించేలా వాగ్దానం చేసింది. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, రెడ్ రెస్పాన్స్ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగం సమన్వయం కొనసాగిస్తున్నారు.
పాల నమూనాలు, రక్త పరిశీలనలు వివిధ ల్యాబ్‌లలో జరుగుతున్నాయి. 72 గంటల్లో పూర్తి ల్యాబ్ రిపోర్ట్ వస్తుందని అంచనా. FSSAI కూడా ఈ ఘటనపై నివేదిక కోరింది. పరిస్తితిని జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు.
రాజమండ్రి లో ఇటీవల సంభవించిన కల్తీ పాల ఘటనలో పలు మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారులు కూడా కిడ్నీ సమస్యలతో చికిత్సలో ఉన్నారు. ఇప్పటివరకు మరణాలు 5–6కి చేరినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా భయభీతిని కలిగించుతోంది.
Next Story

