ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షం
x

ఏపీకి రెయిన్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షం

APSDMA అలర్ట్.. ఆకస్మిక వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండండి


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడు గంటల మధ్య మూడు గంటలు కీలకమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా వివరాలు వెల్లడించారు.


ఉత్తరాంధ్రతో పాటు మన్యం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిడుగు సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, ఓపెన్ ప్రదేశాల్లో ఉండకుండా ఉండాలని తెలిపారు. రైతులు, కూలీలు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులతో సంప్రదించాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని APSDMA సూచించింది.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి మారితే మరిన్ని సూచనలు జారీ చేసే అవకాశముంది.

Read More
Next Story