
ఇరాన్ యుద్ధనౌక మునిగిపోవడంపై ప్రధాని స్పందనేదీ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శ
ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోవడంపై ప్రధాని మోదీ మౌనం పాటించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇరాన్ యుద్ధ నౌక భారత జలాల్లో మునిగిపోయిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్ సమీపానికి వచ్చేసిందని, అయినా ప్రధాని ఇప్పటివరకు స్పందించలేదన్నారు. దేశానికి ఈ సమయంలో స్థిరమైన నాయకత్వం అవసరమన్నారు. దేశం దిగుమతి చేసుకునే చమురులో 40% కంటే ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తుందని, అందువల్ల చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. “ యుద్ధ వాతావరణం ఇప్పుడు మన సమీపానికి చేరుకుంది. మహాసముద్రంలో ఒక ఇరానియన్ యుద్ధనౌక మునిగిపోయింది. అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదు,” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Next Story

