ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే అమెరికాలో నిరసనలు
వైట్ హౌజ్ ఎదురుగా భారీగా మహిళలు, ఆసియన్లు, ఇతర వర్గాల ర్యాలీలు
యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పాలసీలను వ్యతిరేకిస్తూ వేలాది మంది నిరసనలకు దిగారు. వైట్ హౌజ్ ముందు నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా సఖి ఫర్ సౌత్ ఆసియాన్ వాసులు పీపుల్స్ మార్చ్ అనే పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఇంతకుముందు ఈ మార్చ్ ను ఉమెన్ మార్చ్ అని పిలిచేవారు. 2017 నుంచి ఇవి రెగ్యూలర్ గా నిర్వహిస్తున్నారు.
నినాదాలు..
ట్రంప్ కు వ్యతిరేకంగా భారీ నినాదాలు, బ్యానర్లు, పోస్టర్లు తీసుకుని మార్చ్ చేశారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ కు సైతం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఆయన ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే గ్రూప్ 2017 లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పాలసీలకు అనుగుణంగా ఆందోళనలు నిర్వహించింది.
మూడు చోట్ల ఆందోళనలు..
లింకన్ మెమోరియల్ దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ ఆందోళనలు జరిగాయి. ఇందులో మూడు గ్రూపులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ‘‘ మా కమ్యూనిటీలకు మేము ముందుగానే విధేయత చూపడం, ఫాసిజానికి తలవంచడం లేదనే చెప్పడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో సామూహిక నిరసన నిర్వహిస్తున్నాం.’’ అని పీపుల్స్ మార్చ్ పేర్కొంది. తన ప్రమాణ స్వీకారానికి ముందు వారాంతపు కార్యక్రమాల కోసం ట్రంప్ వాషింగ్టన్ చేరుకోవడానికి ఈ ర్యాలీలు జరిగాయి.
ఈ నిరసనలో వివిధ సంఘాలైన అబార్షన్ యాక్షన్ నౌ, టైమ్ టూ యాక్ట్, సిస్టర్ సాంగ్, ఉమెన్స్ మార్చ్, పాపులర్ డెమోక్రసీ ఇన్ యాక్షన్, హ్యరియెట్స్ వైల్డ్ టెస్ట్ డ్రీమ్స్, ది ఫెమినిస్ట్ ఫ్రంట్, ఇప్పుడు ప్లాన్డ్ పేరేంట్ హుడ్, నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ యాక్షన్ ఫండ్ వంటివి ఇందులో పాల్గొన్నాయి.
మహిళల మార్చ్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో జరిగాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలైన న్యూయార్క్, సీటెల్, చికాగో లాంటి పట్టణాల్లో ఇవి కనిపించాయి. ‘‘ మహిళలలు, సమానత్వం, ఇమ్మిగ్రేషన్ వంటి వాటిపై మాకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మాకు మేము మద్దతు ఇవ్వడానికి మేము నిజంగా రావాలనుకుంటున్నాము’’ అని నిరసనకారులలో ఒకరైన బ్రిటనీ మార్టినెజ్ యూఎస్ఏ టుడేతో అన్నారు.
ఈ సారి తేడా ఏంటీ?
ఈసారి ప్రమాణ స్వీకారంలో నిరసనలు, ప్రధాన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నట్లు లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. ట్రంప్ విధానాలు, విలువలను నిరసనకారులు ఖండించారు. వారిలో చాలామంది ఫక్ ట్రంప్, ట్రాన్స్ లైన్ మేటర్స్, స్టాండ్ అప్ ఫైట్ బ్యాక్, నల్లజాతి స్త్రీలను నమ్మండి .. మేము మౌనంగా ఉండలేమని నినాదాలు చేస్తున్నారు.
Next Story