పీఓకే: కాశ్మీరీలపై పాక్ సైనికుల కాల్పులు, పలువురి మృతి
x

పీఓకే: కాశ్మీరీలపై పాక్ సైనికుల కాల్పులు, పలువురి మృతి

పీఓకేలో నిరసనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. నిరసనకారులను అణచివేయడానికి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు..


‘‘మాకు నిత్యవసరాలు కావాలి, ఉచిత విద్యుత్ కావాలి, మా వనరులు మాకు కావాలి.. మాకు ఆజాదీ కావాలి’’ అంటూ గొంతెత్తిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలపై పాక్ సైన్యం పాశవికంగా ప్రవర్తిస్తోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్ లో నిరసనలు చేస్తున్న కాశ్మీరీలపై పాక్ రేంజర్లు, పారామిలిటరీ బలగాలు తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయి.

తాజాగా జరిగిన ఘర్షణల్లో పాక్ సైనికులు కాల్పులు జరపడంతో ముగ్గురు కాశ్మీరి నిరసన కారులు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. పెంచిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలతో ప్రారంభమైన నిరసనలు రోజు రోజుకీ పెరుగుతూ మాకు ఆజాదీ కావాలి అనే స్థాయికి చేరింది.

ఇక్కడికి శాంతి భద్రతలకు కాపాడేందుకు పిలిచిన పారామిలిటరీ రెజ్లర్లపైకి నిరసనకారులు దాడులకు పాల్పడ్డారని డాన్ పత్రిక కథనం ప్రసారం చేసింది. పీఓకే సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ఫఖ్తుంఖ్వా లో నుంచి రావడానికి బదులుగా కొన్ని వాహానాలు ముజఫరాబాద్ సెక్టార్ గ్రామమైన కోహాలా నుంచి నిష్ర్కమించడానికి దారులు ఎంచుకున్న తరుణంలో దాడులకు గురైనట్లు నివేదించింది.

సీన్ రివర్స్
ఈ సందర్భంగా పాక్ సైనికుల వాహనశ్రేణులపై నిరసన కారులు రాళ్లదాడులకు పాల్పడినట్లు తెలిసింది. దీనిని నివారించడానికి పాక్ సైన్యం బాష్పవాయువు గోళాలు ప్రయోగించినట్లు ‘డాన్’ వెల్లడించింది. పీఓకే కు రాయితీలు ఇవ్వడానికి పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చినా నిరసనకారులు శాంతించలేదు.
పీఓకే లో నిరసనల సందర్భంగా దాదాపు 100 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఒక అధికారి మరణించినట్లు సమాచారం. నిరసనలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. 40 కిలోల గోధుమ పిండి పై సబ్సిడీల కారణంగా రూ. 3100 నుంచి రూ. 2000 తగ్గిస్తామని, విద్యుత్ టారిఫ్ లు కూడా పాకిస్తాన్ కరెన్సీలో రూ. 3, 5, 6 తగ్గించారు. ఇవి 100 యూనిట్లు, 200 యూనిట్లు, 300 యూనిట్లకు వర్తిస్తాయని ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు శాంతించలేదు.
జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేతృత్వంలో ఈ నిరసన జరిగింది, ఈ ప్రాంతంలోని చాలా ప్రాంతాలలో వ్యాపారులు, సామాన్య ప్రజలు ఈ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను తమ రేట్లకే అందివ్వాలని, గోధుమ పిండి, ఇతర అధికారాలను తమకే అప్పగించాలని కోరుతూ నిరసనలకు దిగారు.
వీల్‌ జామ్‌ సమ్మె నాలుగో రోజుకు చేరడంతో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన లాంగ్‌ మార్చ్‌ సోమవారం పీఓకే రాజధాని ముజఫరాబాద్‌కు బయలుదేరింది.జేఏసీ కోర్ కమిటీ, ప్రాంత ప్రధాన కార్యదర్శి దావూద్ బరీచ్ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో జేఏపీ ముజఫరాబాద్ ర్యాలీకి పిలుపునిచ్చింది.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు
పోలీసులు, నిరసనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలపై పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
"తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని పార్టీలు శాంతియుత చర్యలను ఆశ్రయించవలసిందిగా నేను కోరుతున్నాను. వ్యతిరేకులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఈ విషయం త్వరలో పరిష్కరించబడుతుందని ఆశిస్తున్నాము" అని ఆయన అన్నారు.
ఉద్రిక్తతలను శాంతపరిచే తన ప్రయత్నాలలో భాగంగా, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పార్టీలతో హుటాహూటిన సమావేశాలు నిర్వహించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
కాగా పీఓకేలో నిరసనల సందర్భంగా భారతీయ జెండా రెపరెపలాడింది.



Read More
Next Story