పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
x

పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

మధురై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు


Click the Play button to hear this message in audio format

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడులోని మధురై, పుదుచ్చేరిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సాయంత్రం మధురైలోని తిరుప్పరంకుండ్రంలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి చెన్నై చేరుకున్న ప్రధానికి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెనరాసు, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన లోక్ భవన్‌కు వెళ్లి రాత్రి బస చేశారు. పుదుచ్చేరి పర్యటనలో ప్రధాని రూ. 2,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. మదురైలో ఆయన రూ. 4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించారు.

Read More
Next Story