పిఠాపురం నా అడ్డా.. గొడవలు చేస్తే ఏరివేస్తా!
x

పిఠాపురం నా అడ్డా.. గొడవలు చేస్తే ఏరివేస్తా!

పిఠాపురం ఇకపై జనసేనకు ఐడియాలాజికల్ హెడ్ క్వార్టర్ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.


పిఠాపురంలో తాటాకు ఎగిరినా, స్కూల్ పిల్లలు గొడవ పడినా అదొక పెద్ద వార్తలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. 'నా మాటలే మెత్తగా ఉంటాయి.. కానీ నా చేతలు చాలా గట్టిగా ఉంటాయి.. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను' అంటూ సింహగర్జన చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కోట్లు సంపాదించడానికి కాదని, సినిమాల్లో ఫ్లాప్ వచ్చినా తనకు డబ్బులు వస్తాయని.. కానీ వ్యవస్థను మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. 'మెత్తగా ఉంటే నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తున్నారు' అంటూ వైసీపీ ఫేక్ ప్రచారంపై నిప్పులు చెరిగిన సేనాని, పిఠాపురం ఇకపై జనసేనకు ఐడియాలాజికల్ హెడ్ క్వార్టర్ అని ప్రకటిస్తూ క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు. "నా మాటలే మెత్తగా ఉంటాయి.. కానీ నా చేతలు చాలా గట్టిగా ఉంటాయి. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను" అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యర్థులకు సింహ గర్జన చేశారు. శుక్రవారం పిఠాపురంలో నిర్వహించిన ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రాజకీయ విమర్శలపై నిప్పులు చెరిగారు.

జగన్ అండ్ కో పై విమర్శనాస్త్రాలు

వైసీపీ సోషల్ మీడియా ప్రచారంపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిఠాపురంలో తాటాకు ఎగిరినా, స్కూల్ పిల్లలు కొట్టుకున్నా భూతద్దంలో చూపిస్తూ వైరల్ చేస్తున్నారు. అదే పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపేస్తే మీ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు తాము మెత్తగా ఉంటుంటే నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు.

అభివృద్ధి మంత్రం - నియోజకవర్గ ప్రగతి

రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెబుతూ పవన్ కీలక ప్రకటనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ. 212 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. తనకు యుద్ధకళలంటే ఇష్టమని చెబుతూ, పిఠాపురంలో తన సొంత ట్రస్ట్ ద్వారా త్వరలోనే ఒక మార్షల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని స్థాపిస్తామని ప్రకటించారు. పిఠాపురం ఇకపై జనసేన భావజాలానికి కేంద్రం అని పేర్కొంటూ, మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను ఇక్కడే నిర్వహిస్తామని ముహూర్తం ఖరారు చేశారు.

కూటమి ఐక్యతపై స్పష్టత

సీఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు గారు చాలా ప్రజాస్వామ్యవాది. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. కూటమి స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయొద్దు. పొత్తులను బలహీనం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు.

సంక్రాంతి సంబరాల సందడి

స్థానిక ఆర్‌.ఆర్‌.బి.హెచ్‌.ఆర్‌ కళాశాల మైదానంలో సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన పవన్, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని చాటిచెప్పేలా ఈ పండుగ జరగాలన్నారు. తెలంగాణ నుంచి కూడా సోదరీమణులను ఆహ్వానించి ఇక్కడి సంస్కృతిని రుచి చూపాలని సూచించారు. డబ్బు సంపాదించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు.. సినిమాల్లో ప్లాప్ వచ్చినా నాకు కోట్లు వస్తాయి. నేను వచ్చింది వ్యవస్థను మార్చడానికి అని పవన్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Read More
Next Story