
‘ఎక్కువ విమాన సర్వీసులు నడపాలి’
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి విమాన సర్వీసుల సంఖ్యను వెంటనే పెంచాలని, అలాగే విమాన ఛార్జీలను నియంత్రణలో ఉంచాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేరళవాసులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వివరిస్తూ ఆయన ప్రధాని మోదీకి మార్చి 5న లేఖ రాశారు.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచి భారతదేశానికి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయని, గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే ప్రయాణీకుల కోసం మరిన్ని సర్వీసులు తిప్పాలని విజయన్ లేఖలో కారు.
భారీగా పెరిగిన టిక్కెట్ల ధరలు.
విమానాల కొరతతో పాటు, సంక్షోభ సమయంలో టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విమానయాన సంస్థలు గల్ఫ్ నగరాల నుంచి భారతదేశానికి నడిచే చార్టర్డ్ సర్వీసులకు సాధారణ ధరల కంటే చాలా రెట్లు ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని పేర్కొ్న్నారు. విదేశాలలో చిక్కుకున్న కార్మికులు, కుటుంబాలు అదనపు ఆర్థిక భారం ఎదుర్కోకుండా స్వదేశానికి తిరిగి రావడానికి టిక్కెట్ ధరలను నియంత్రణలో ఉంచాలని కోరారు.

