తెలంగాణ, కర్ణాటకలో ‘బుల్డోజర్ రాజ్’పై పినరయి విమర్శలు..
x

తెలంగాణ, కర్ణాటకలో ‘బుల్డోజర్ రాజ్’పై పినరయి విమర్శలు..

2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించిన కేరళ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు


Click the Play button to hear this message in audio format

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ బలవంతపు కూల్చివేతలను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూమిలో నిర్మించిన సుమారు 700 ఇళ్లను పోలీసుల సమక్షంలో కూల్చివేశారని, ముందస్తు నోటీసు లేకుండా 3వేల మంది కుటుంబాలు నిరాశ్రయులుగా మార్చారని పేర్కొన్నారు. అలాగే యలహంకలోని కోగిలు లేఅవుట్‌లో రెండురోజుల క్రితం 150కి పైగా కుటుంబాలను వీధులు పాలు చేశారని ఆరోపించారు. “ఇలాంటి అమానవీయ చర్యలకు కాంగ్రెస్ ఎలా నాయకత్వం వహిస్తుంది’’ అని ఆయన ప్రశ్నించారు.


కేరళ విధానం వేరు..

విపత్తు బాధితుల కోసం కేరళ ప్రభుత్వం ఇళ్లను పునర్నిర్మించి, పునరావాసం కల్పిస్తోందని పినరయి తెలిపారు. భూ పట్టాలు లేని వారికి పట్టాలు పంపిణీ చేసి, నిజమైన భూ యజమానులుగా మారుస్తున్న కేరళ ప్రభుత్వ విధానం.. తెలంగాణలోని బలవంతపు కూల్చివేతలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.


కాంగ్రెస్‌పై సీపీఐ(ఎం)దాడి..

కూల్చివేతలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర భారత బీజేపీ విధానాలకు ప్రతిరూపంగా మారుతుందని పినరయి విజయన్ పేర్కొన్నారు, “ఎక్కడా సాధారణ ప్రజల హక్కులు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం బలవంతపు చర్యలు చేపడుతుంది” అని వ్యాఖ్యానించారు.

కేరళలో మానవతావాదం, పేదలకు అనుకూల విధానాలు ఉంటే.. తెలంగాణ, కర్ణాటకలో బలవంతపు కూల్చివేతలు కొనసాగుతున్నాయని పినరయి విజయన్ పేర్కొన్నారు. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పినరయి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More
Next Story