చెన్నైలోని టీవీకే కార్యాలయం వద్ద రద్దీ..
x

చెన్నైలోని టీవీకే కార్యాలయం వద్ద రద్దీ..

కార్లు, బైకులే, బారికేడ్లతో నిండిపోయిన రోడ్డు - బయటకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డ కాలనీవాసులు - పార్టీ కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకోవాలని డిమాండ్..


Click the Play button to hear this message in audio format

చెన్నై(Chennai)లోని పనైయూర్ ప్రాంతంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఆదివారం పార్టీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాల పంపిణీని ప్రారంభించారు. మొదటి రోజే సుమారు 5వేల మంది కార్యకర్తలు, మద్దతుదారులు కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చిన వారు తమ వాహనాలను కాలనీలోని ఇళ్లముందే పార్క్ చేసి వెళ్లిపోయారు. మరోవైపు అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో బయటకు వెళ్లే దారిలేక ఇబ్బంది పడ్డారు.

“మేం పన్నులు చెల్లిస్తున్నాం. మా వీధుల్లో స్వేచ్ఛగా నడవలేకపోతున్నాం” అని స్థానికుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లను పార్కింగ్‌కు వాడుకోవడం సరైంది కాదన్నారు. నివాస ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఫంక్షన్ హాళ్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకోవాలని వారు కోరుతున్నారు.

‘మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం..’

అనుకున్న సంఖ్య కంటే భారీగా జనం తరలివచ్చారని, ఈ స్థాయిలో వస్తారని మేం ఊహిందలేదని టీవీకే వర్గాలు అంగీకరించాయి. భవిష్యత్తులో స్థానికులకు ఏ అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పార్టీ నేతలు స్థానికులతో అన్నారు. TVK పార్టీని సినీనటుడు విజయ్(Vijay) ప్రారంభించిన విషయం తెలిసిందే.

గత ఏడాది కరూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read More
Next Story