
యుద్ధం షురూ, పాక్ దాడుల్ని తిప్పికొట్టిన ఇండియా
ఆకాశం నిప్పులు కక్కుతోంది. మిస్సెల్స్ మోతలు వినపడుతున్నాయి. బాంబుల మోతలు వినిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మచీకట్లో మునిగి ఉన్నాయి.
జమ్మూను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులు మొదలు పెట్టింది. ఆకాశం నిప్పులు కక్కుతోంది. మిస్సెల్స్ మోతలు వినపడుతున్నాయి. బాంబుల మోతలు వినిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మచీకట్లో మునిగి ఉన్నాయి. పలు రాష్ట్రాలలో కరెంటు తీసేసి బ్లాక్ అవుట్ ప్రకటించారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్లను, మిస్సైళ్లను ఇండియా సమర్థంగా కూల్చేస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులకు ప్రతికారంగా పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్ధంగా తిప్పికొడుతోంది. జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్ పాటించారు.
జమ్మూతో సహా పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు.
మరోవైపు, పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.
జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో హైఅలర్ట్..
భారత్-పాక్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తొయ్యిబా ఉగ్రసంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు.
పంజాబ్ లోని పలు జిల్లాలలో కరెంట్ బంద్
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘‘గుర్‌దాస్‌పుర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం కచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయి’’ అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Next Story