
ఏపీ ప్రభుత్వ సలహాదారుకి పద్మభూషణ్
13 మంది తెలుగు తేజాలకు పద్మ పురస్కారాలు వరించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవం (2026) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుండి వైద్య, కళా, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారు ఈ జాబితాలో నిలిచారు.
ప్రముఖుల వివరాలు
పద్మభూషణ్: ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వైద్య రంగంలో ఆయన చేసిన అంతర్జాతీయ స్థాయి సేవలకు ఈ గుర్తింపు లభించింది.
పద్మశ్రీ (దిల్లీ కోటా): యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ దిల్లీ విభాగం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ గ్రహీతలు
కళలు, సినిమా, సామాజిక రంగాల నుంచి పలువురు ప్రముఖులకు పద్మశ్రీ వరించింది.
రాజేంద్ర ప్రసాద్ (నటుడు): కళా రంగం (సినిమా).
మురళీ మోహన్ (మాగంటి): కళా రంగం (సినిమా).
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్: అన్నమయ్య సంకీర్తనల వ్యాప్తిలో ఆయన చేసిన కృషికి గాను కళా విభాగంలో అవార్డు లభించింది.
దీపికారెడ్డి: నృత్య కళాకారిణి (కూచిపూడి).
విజయ్ ఆనంద్ రెడ్డి: వైద్య రంగం.
గూడూరు వెంకట్రావు: వైద్య రంగం.
వెంపటి కుటుంబ శాస్త్రి: సాహిత్యం, విద్య.
మామిడి రామారెడ్డి (మరణానంతరం): పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపు.
కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్: సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
కుమారస్వామి తంగరాజ్: సైన్స్ విభాగం.
గడ్డమనుగు చంద్రమౌళి: సైన్స్ విభాగం.

