
‘ఇరాన్‌లో చిక్కుకున్న తమిళ మత్స్యకారులను కాపాడాలి’
సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్..
ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారని కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తెలిపారు. వారి పరిస్థితి గురించి తక్షణ చర్చించాలని లోక్‌సభలో మార్చి 25న వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. వారి ఇబ్బందులను సభా దృష్టికి తెచ్చారు. చిక్కుకుపోయిన మత్స్యకారులు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిలో భయాందోళనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
“మత్స్యకారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారికి వెంటనే సహాయం చేయాలి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి’’ అని కోరారు. వారిని తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆహారం, వైద్య అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సురక్షితంగా వారిని భారత్ తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story

