
అస్కార్ అవార్డుల పండుగ..
ఉత్తమ చిత్రంగా ఎంపికై అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘‘One Battle After Another’’.
2026 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ స్టూడియోస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘‘One Battle After Another’’. ఈ చిత్రానికి ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్‌సన్ (Paul Thomas Anderson) ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ తారాగణం క్యాటగిరిల్లోనూ అవార్డులు సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రంలో హీరో ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో.
ఇక రియాన్ కాగ్లర్ (Ryan Coogler) దర్శకత్వం వహించిన ‘‘Sinners’’ చిత్రానికి మొత్తం 16 కేటగిరీల్లో నామినేషన్లు వచ్చాయి. దీంతో ఒకే చిత్రానికి అత్యధిక నామినేషన్లు వచ్చిన రికార్డు నమోదైంది. అయితే ఈ చిత్రానికి నాలుగు అవార్డులు లభించాయి. 1930లో మిస్సిసిప్పి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సిన్నర్స్’ చిత్రంలో తన ద్విపాత్రాభినయానికి Michael B. Jordan ఉత్తమ నటుడిగా మొదటిసారి ఆస్కార్ అందుకున్నారు.
ముఖ్య విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: One Battle After Another
ఉత్తమ దర్శకుడు: Paul Thomas Anderson – One Battle After Another
ఉత్తమ నటుడు: Michael B. Jordan – Sinners
ఉత్తమ నటి: Jessie Buckley – Hamnet
ఇతర ముఖ్య అవార్డులు:
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – “Golden” (KPop Demon Hunters)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం – Sentimental Value
ఉత్తమ సినిమాటోగ్రఫీ – Sinners
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – One Battle After Another
ఉత్తమ సౌండ్ – F1
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – Sinners
ఉత్తమ డాక్యుమెంటరీ – Mr. Nobody Against Putin
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – Avatar: Fire and Ash
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – Frankenstein
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – Sinners
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – One Battle After Another
ఉత్తమ సహాయ నటుడు – Sean Penn – One Battle After Another
ఉత్తమ సహాయ నటి – Amy Madigan – Weapons
మొత్తంగా ఈసారి ఆస్కార్ అవార్డులు కొత్త రికార్డులు, చారిత్రాత్మక విజయాలు, ఊహించని ఫలితాలతో హాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

