ఆ నాలుగు రోజులు ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలు బంద్
పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగనుంది. నాలుగు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగనుంది. నాలుగు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వరకు ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయదని పేర్కొంది.
‘‘సాంకేతిక నిర్వహణ కార్యకలాపాల వల్ల పాస్‌పోర్టు సేవా పోర్టల్ సేవలు ఆగస్టు 29వ తేదీ 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30కి చేసుకున్న అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ అవుతాయి. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తుదారుడికి అందిస్తాం’’అని పాస్‌పోర్టు సేవా పోర్టల్ పేర్కొంది.
పాస్‌పోర్ట్ సేవా పోర్టల్..కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయడానికి, పాస్‌పోర్ట్ రెన్యూవల్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. అపాయింట్‌మెంట్ తేదీ ఖరారైన రోజు..దరఖాస్తుదారుడు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకోవాలి. అలాగే అన్ని ధృవీకరణ పత్రాలను పాస్ పోర్టు అధికారులను చూయించాల్సి ఉంటుంది. అనంతరం దీనిపై పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక.. పాస్ పోర్టు దరఖాస్తుదారు చిరునామాకు వస్తుంది.