ఏపీలో ఫుల్ గ్యాస్… కంగారు వద్దన్న సీఎం చంద్రబాబు
x

ఏపీలో ఫుల్ గ్యాస్… కంగారు వద్దన్న సీఎం చంద్రబాబు

సిలిండర్ డైవర్షన్‌పై కఠిన చర్యలు… సీఎం ఆదేశాలు


ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో కొంత గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు.
గ్యాస్ సరఫరా పరిస్థితిపై సీఎం ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇంకా 15 రోజుల అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నట్లు సీఎం వెల్లడించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సిలిండర్ల దుర్వినియోగం, డైవర్షన్‌ను అరికట్టేందుకు కేవైసీ, ఓటీపీ విధానాలను కచ్చితంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్‌ల లభ్యతను పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సమీక్ష సమావేశానికి హాజరైన సీఎస్ విజయానంద్, ఓఎన్‌జీసీ, GAIL తదితర పెట్రోలియం సంస్థల ప్రతినిధులకు సూచించారు.
అదేవిధంగా రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని, Krishna-Godavari Basin నుంచి వచ్చే గ్యాస్‌ను పైప్‌లైన్‌ల ద్వారా మరింత విస్తృతంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
Read More
Next Story