
ఏప్రిల్ 1 నుంచి NH టోల్ ప్లాజాలు పూర్తిగా డిజిటల్..
ఫాస్ట్‌ట్యాగ్, UPI చెల్లింపులకే అనుమతి..
దేశంలోని అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాలు వద్ద నగదు చెల్లింపులను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయనున్నాయి. టోలింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో భాగంగా ఇకనుంచి ఫాస్ట్‌ట్యాగ్, UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లింపులు ఉంటాయని NHAI అధికారులు తెలిపారు. నగదు రహిత లావాదేవీల కారణంగా వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని 98 శాతం వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ అనుసంధానంతో తిరుగుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ ప్లాజాలోకి ప్రవేశిస్తే వాహన యజమాని రెట్టింపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 1,150 కి పైగా ఉన్న టోల్ ప్లాజాలు ఈ మార్పునకు సిద్ధమవుతున్నాయి.
Next Story

