మోదీ ఎన్నికల తరువాత ప్రోటోకాల్ ను ఉల్లంఘించారా? ఎలా?
x

మోదీ ఎన్నికల తరువాత ప్రోటోకాల్ ను ఉల్లంఘించారా? ఎలా?

ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని పలువురు నిఫుణులు చెబుతున్న మాట. ఏం జరిగిందంటే..


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు బుధవారం (జూన్ 5) తన నివాసంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాల సమావేశానికి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన హడావిడి తీరుపై రాజకీయ నిపుణులు దృష్టి సారించారు. ఇది నిబంధనలు ఉల్లఘించడమేనని వారు విశ్లేషిస్తుననారు.

NDA భాగస్వాములు నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నాయి. 1962 తరువాత దేశంలో ఏ పాలక కూటమికి కూడా మూడో సారి అధికారం దక్కలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ అవకాశం దక్కింది. రాజకీయ వ్యాఖ్యాత జావేద్ అన్సారీ దీనిని " గుర్రం ముందు బండి పెట్టడం" అని పిలిచారు.
సరైన విధానం అనుసరించలేదు..
ఈ సందర్భంగా అన్సారీ ఫెడరల్ తో మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత అనుసరించాల్సిన ప్రక్రియ రూల్ బుక్ లో ఉందని అన్నారు. ‘‘ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత అభ్యర్థులకు గెలిచినట్లు ధృవీకరణ పత్రం అందిస్తారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మిగిలిన కమిషనర్లు కూడా రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కొరతారు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు’’ అని అన్సారీ అంటున్నారు.
ఆ తరువాత లోక్ సభను రాష్ట్రపతి రద్దు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి అతి పెద్ద పార్టీ లేదా కూటమి నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వనిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మెజారిటి నెంబర్లను చూపించమని అడుగుతారు.
రాష్ట్రపతి తృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత కూడా మరో ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుందని వివరించారు. సభలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వం తన మెజారిటినీ నిరూపించుకోవడానికి తేదీ కేటాయిస్తారని అన్నారు.
EC ఇంకా రాష్ట్రపతిని కలవలేదు
అంతేకాకుండా, ముందుగా ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి తన మాతృ రాజకీయ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడాలి. అది పూర్తయిన తర్వాత మాత్రమే మిత్రపక్షాల సమావేశాన్ని పిలిచి, ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడిని వారిచే ఎన్నుకోవచ్చని ఆయన వివరించారు.
పార్టీ, మిత్రపక్షాల మద్దతు లేఖతో అధినేత రాష్ట్రపతి వద్దకు వెళ్లి మళ్లీ అంకెలు (272 కంటే ఎక్కువ, మెజారిటీ మార్క్) చూపించడం తదుపరి దశ. దానిని అనుసరించి, రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నాయకుడిని ఆహ్వానిస్తున్నారని అన్సారీ ఎత్తి చూపారు. అయితే, ఈ సందర్భంలో, CEC ఇంకా రాష్ట్రపతిని కలుసుకుని ఆమెకు లేఖ ఇవ్వనప్పటికీ, అండ మిత్రపక్షాలు మోదీని ప్రభుత్వానికి సారథ్యం వహించాలని కోరాయి. ఎన్నికల సంఘం లేఖ సమర్పించే వరకు రాష్ట్రపతి కూడా ఎవరినీ ఆహ్వానించలేరని ఆయన అన్నారు .
మోదీ ఎందుకు హడావిడి ?
మోదీ ఇతర బిజెపి నాయకులు చేస్తున్న హడావిడి విధానాన్ని తొందరపాటు తనాన్ని సూచిస్తుందని అన్సారీ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ లోని ఓ వర్గం నుంచి తనకు సవాల్ ఎదురవుతుందని మోదీ భయపడుతున్నట్లు ఉన్నారని అన్సారీ అంచనకొస్తున్నారు.
బిజెపి - ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య గ్యాప్ పెరుగుతుందని అన్సారీ అంటున్నారు. బీజేపీ చీఫ్ నడ్డా ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీని నడపడానికి ఆర్ఎస్ఎస్ అవసరం లేదని అన్నారు. ఇది పార్టీ దాని మాతృ సంస్థ మధ్య అంతరం పెరగడాన్ని సూచిస్తోందని అన్నారు.


Read More
Next Story