నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) చీఫ్‌గా నలిన్ ప్రభాత్..
x

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) చీఫ్‌గా నలిన్ ప్రభాత్..

జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) చీఫ్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి నలిన్ ప్రభాత్‌ను నియమించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) చీఫ్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి నలిన్ ప్రభాత్‌ను నియమించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. NSG డైరెక్టర్ జనరల్‌గా ప్రభాత్ ఆగస్ట్ 31, 2028 వరకు కొనసాగుతారు.

ఇదివరకు శశస్త్ర సీమా దళ్ (ఎస్‌ఎస్‌బీ) చీఫ్ దల్జీత్ సింగ్ చౌదరి ఈ బాధ్యతలను నిర్వహించేవారు. బ్లాక్ క్యాట్స్ గా పిలువబడే ఈ (ఎన్‌ఎస్‌జీ) దళాన్ని 1984లో ఏర్పాటు చేశారు.

అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్‌గా సప్నా తివారీని నియమించారు. ఈమె ఒడిశా కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఐబీ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇకపై ఐబీ ప్రత్యేక డైరెక్టర్‌‌గా ఏప్రిల్ 30, 2026 వరకు కొనసాగనున్నారు.

Read More
Next Story