నాగ్‌పూర్ పేలుడు: ఎస్‌బిఎల్ ఎనర్జీ డైరెక్టర్ల అరెస్ట్, 21 మందిపై కేసు
x

నాగ్‌పూర్ పేలుడు: ఎస్‌బిఎల్ ఎనర్జీ డైరెక్టర్ల అరెస్ట్, 21 మందిపై కేసు

ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్


Click the Play button to hear this message in audio format

నాగ్‌పూర్‌లోని ఎస్‌బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ యూనిట్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందగా, దాదాపు 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో సంస్థకు చెందిన తొమ్మిది మంది డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో 21 మంది వాటాదారులపై కేసు నమోదు చేశారు.

నాగ్‌పూర్‌కు సుమారు 35 కి.మీ దూరంలోని కల్మేశ్వర్ తాలూకా రౌల్‌గావ్ గ్రామంలోని ఎస్‌బిఎల్ ఎనర్జీ గోలాబారుద తయారీ యూనిట్‌లో ఉదయం 6 గంటలకు ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో సుమారు 35 మంది కార్మికులు, ఇద్దరు సూపర్‌వైజర్లు విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగి మంటలు త్వరగా విస్తరించడంతో మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయా. వారి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి కుటుంబసభ్యలకు అందజేయనున్నారు. 2023లో కూడా ఈ సంస్థకు చెందిన యూనిట్‌లో పేలుడు జరిగి 9 మంది చనిపోయారు.

ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

Read More
Next Story