జర్మనీ ఉగ్రదాడిపై ‘మస్క్’ ఏమన్నాడో తెలుసా?
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంపై అసంతృప్తి
జర్మనీలోని మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్ లో సౌదీ అరేబియా జాతీయుడు కారుతో దూసుకెళ్లి ఐదుగురిని హత్య చేయడంపై యూఎస్ బిలియనీర్ ఇలాన్ మస్క్ వింతగా స్పందించాడు. ఈ సంఘటన జర్మనీ ప్రభుత్వపు ‘‘ ఆత్మహత్య దాతృత్వం’’గా అభివర్ణించారు. కారుతో దాడి చేసిన వ్యక్తిని తలేబ్ గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన తరువాత అక్కడున్న ప్రజలు తలేబ్ కు దేహశుద్ది చేశారు.
తలేబ్ ఎవరు?
మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో దుకాణదారుల గుంపులో తన బిఎమ్‌డబ్ల్యూని దురుసుగా నడిపిన తలెబ్ వయస్సు 50 సంవత్సరాలు. ఆయన సౌదీ అరేబియాకు చెందిన వైద్యుడు, అతను 2006 నుంచి తూర్పు రాష్ట్రమైన సాక్సోనీ-అన్హాల్ట్‌లో నివసిస్తున్నాడని కొన్ని నివేదికలు తెలిపాయి. 2016లో శరణార్థిగా గుర్తించబడిన అతను సైకియాట్రీ సైకోథెరపీ సేవల సలహాదారుగా పనిచేస్తున్నారు.
డైలీ మెయిల్ ప్రకారం, ఇస్లాం ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతిరోజు ఎక్స్ లో పోస్టులు పెట్టేవాడు. తనను తాను మాజీ ఇస్లాం అనుచరుడిగా చెప్పకుంటూ, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ కి మద్దతు ప్రకటించాడు.
కానీ నిజానికి పశ్చిమాసియా నుంచి ఉగ్రవాదం, వలసలు, మహిళల అక్రమ రవాణాకు సంబంధించి తలేబ్ మోస్ట్ వాంటేడ్ వ్యక్తి. ఆయన పై రియాద్ లో అనేక కేసులు ఉన్నాయి. స్వదేశానికి రప్పించడాని చేసిన అన్ని ప్రయత్నాలను జర్మనీ నిరాకరించింది. అనేక అభ్యర్థనలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ తలేబ్ కు అప్పటి ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది.
'పిచ్చివాడు, జర్మనీలోకి అనుమతించకూడదు'
తలేబ్‌ను అప్పగించాలని సౌదీ అరేబియా చేసిన అభ్యర్థనలను విస్మరించినందుకు ఒక వినియోగదారు జర్మన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టు పై ఎలాన్ స్పందించారు. దీన్ని ప్రభుత్వపు ఆత్మహత్య దాతృత్వంగా అభివర్ణించారు.
“అవును, అతను స్పష్టంగా ఒక పిచ్చివాడు, అతను జర్మనీలోకి ప్రవేశించడానికి ఎప్పుడూ అనుమతించి ఉండకూడదు. సౌదీ అరేబియా అభ్యర్థన చేసినప్పుడు వారిని అప్పగించాలి. జర్మన్ ప్రభుత్వం ఆత్మహత్య దాతృత్వం” అని పోస్ట్ చేశాడు.
ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన మస్క్, తలేబ్‌పై అత్యాచారం, ఇతర తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిని అప్పగించడానికి జర్మన్ ప్రభుత్వం నిరాకరించడం గురించి సౌదీ రాజకీయ వ్యాఖ్యాత చేసిన సుదీర్ఘ పోస్టును కూడా మస్క్ రీట్వీట్ చేశారు.
జర్మనీకి వచ్చిన తలేబ్ వ్యూహాత్మకంగా జర్మనీలో పూర్తి ఆశ్రయం, రక్షణ కోసం నాస్తికుడిగా, మాజీ ముస్లింగా తనను తాను మార్చుకున్నట్లు నటించాడని ఆయన తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. జర్మనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటికీ, తలేబ్ ఏకకాలంలో మానవ అక్రమ రవాణా, యువతులను స్మగ్లింగ్ చేయడం, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుంచి బాలికలు, మైనర్లను జర్మనీకి పారిపోయేలా ప్రోత్సహించడం వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కొంతమంది ఆరోపించారు. "జర్మన్ ప్రభుత్వం వైఫల్యాన్నిఅర్థం చేసుకోవడానికి ముఖ్యమైన థ్రెడ్ ఇది" అని పోస్ట్‌ను పంచుకుంటూ మస్క్ అన్నారు.
Next Story