ఉక్రెయిన్ పైకి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రష్యా
ఉక్రెయిన్ - రష్యా యుద్దంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రిమ్లిన్ తన అమ్ముల పొదిలో నుంచి తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది.
రెండు సంవత్సరాలుగా ఎడతెగకుండా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం లో మరో అంకానికి అమెరికా తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో రష్యా తన దాడిని తీవ్రతరం చేసింది. తాజాగా మాస్కో, కీవ్ పైకి బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు.
క్రిమ్లిన్, కీవ్ లోని డ్నీప్రో ప్రాంతం లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మిస్సైల్ ను ప్రయోగించినట్లు ఆ దేశ సైనిక అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఆరు క్షిపణులను సైతం ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ క్షిపణులు అన్ని కూడా డ్నిఫ్రో ప్రాంతంపైనే లక్ష్యంగా ఉన్నాయని వెల్లడించాయి. అయితే కొన్ని పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా ప్రయోగించింది బాలిస్టిక్ క్షిపణి కాదని వెల్లడించాయి.
ICBM దాడి గురించి క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ను ప్రశ్నించగా, ఈ సమాచారం కోసం మిలిటరీ ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. బాలిస్టిక్ క్షిపణులు 5000 కిలోమీటర్ల పైగా లక్ష్యాలను ఛేదిస్తాయి. ఈ క్షిపణులు కేవలం ఏడు దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. అత్యధిక దూరం ప్రయాణించే క్షిపణులు రష్యా వద్ద మాత్రమే ఉన్నాయి.
యుద్దాన్ని మలుపు తిప్పిన బైడెన్ నిర్ణయం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డెమోక్రాటిక్ పార్టీ పోతూ పోతూ చిచ్చు రాజేసి పోయింది. ట్రంప్ ఎన్నికల్లో రష్యా- ఉక్రెయిన్ యుద్దాన్ని ఒక్కరోజులో ఆపేస్తామని ప్రకటించారు. రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతోనే బైడెన్ ప్రభుత్వం, ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ క్షిపణులతో రష్యా భూభాగంపై దాడులు చేయడానికి అనుమతిచ్చాడు.
ఈ నిర్ణయం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ దేశంపై అణుశక్తి కలిగిన దేశాల సాయంతో దాడి చేస్తే అది మా సార్వభౌమత్వంపై దాడిగానే పరిగణిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ కోసం అణు విధానాన్ని సైతం మార్చివేసింది. పుతిన్ అణ్వాయుధాలను దాడికోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. తాజాగా ఉక్రెయిన్ పై బాలిస్టిక్ మిస్సైల్ డమ్మీ ని ప్రయోగించారని కొన్ని మీడియా సంస్థలు అంచనా వేశాయి.
Next Story