
Sudheer Reddy S/O MLA Aadinarayana Reddy
Big Breaking : ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి కొడుకు హైదరాబాద్ లో అరెస్ట్
గతంలో కూడా సుధీర్ రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటు దొరికిన విషయం ఇపుడు బయటపడింది
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని ఎంఎల్ఏ కొడుకు హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటు అరెస్టవ్వటం సంచలనంగా మారింది. బీజేపీ జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని తెలంగాణ ఈగల్ టీమ్ శనివారం అరెస్టుచేసింది. నానక్ రామ్ గూడలోని ఒక అపార్ట్ మెంటులో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో ఈగల్ బృందం సడెన్ గా రెయిడ్ చేసింది. ఆ రెయిడ్ లో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారిని అరెస్టుచేసి రక్తపరీక్షలు చేయించారు పోలీసులు. ఇద్దరికీ పాజిటివ్ అనే వచ్చింది. ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించినపుడు వీరిలో సుధీర్ రెడ్ది జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి కొడుకన్న విషయం బయటపడింది. గతంలో కూడా సుధీర్ రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటు దొరికిన విషయం ఇపుడు బయటపడింది.
Next Story

