ఒకప్పటి మిలిటరీ స్కూల్ స్నేహితులు.. ఉగ్రవాదులు ఎలా అయ్యారు?
x

ఒకప్పటి మిలిటరీ స్కూల్ స్నేహితులు.. ఉగ్రవాదులు ఎలా అయ్యారు?

నమ్మిన స్నేహిడితుడిని నట్టేట ముంచిన ఆ ఉగ్రవాదీ డేవిడ్ కోల్మన్ హెడ్లీ


రాజేష్ ఆహుజా

భారత ఆర్థిక రాజధాని ముంబై పై 2008 లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేశారు. దీనికి కీలక సూత్రధారులు అయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీ, మరోకరు తహవ్వూర్ రాణాలు. వీరు ఇరువురు చిన్ననాటి మిత్రులు.

వీరిలో ఒకరైన రాణా పాకిస్తాన్ సైన్యం నుంచి పారిపోయారు. రెండో నిందితుడు హెడ్లీ కఠిన శిక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రాసిక్యూటర్లతో ఒప్పందాలు కుదర్చుకోవడానికి ప్రయత్నించి విఫలమైన ఓ హెరాయిన్ స్మగ్లర్.
వీరిద్దరికి చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉంది. అయితే దశాబ్ధాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కారణంగా వీరిమధ్య స్నేహం పాతకాలంలా లేదు.
అమెరికన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డబుల్ ఏజెంట్ డేవిల్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ, తహవ్వూర్ రాణా మధ్య స్నేహానికి తొలి బంధాన్ని దర్యాప్తు అధికారులు వెలికితీయగలిగారు. భారత్, అమెరికా దర్యాప్తు పత్రాల ద్వారా రాణా, హెడ్లీ కథ వారి దశాబ్ధాల నాటి బంధం అనేక కొత్త విషయాలు అందిస్తుంది.
కలిసికట్టుగా.. విడిగా
వీరిద్దరూ మొదట పాకిస్తాన్ లోని సైనిక ప్రిపరేషన్ స్కూల్ అయిన హసన్ అబ్దాల్ లోని క్యాడేట్ కాలేజీలో కలుసుకున్నారు. అక్కడి నుంచి రాణా పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా చేరి కెప్టెన్ గా పనిచేశాడు.
చివరికి సైన్యాన్ని విడిచిపెట్టి చికాగోకు వెళ్లే ముందు కెనడియన్ పౌరసత్వం పొందాడు. అక్కడి అధికారిక పత్రాల ప్రకారం.. రాణా చికాగో, న్యూయార్క్, టొరంటోలలో ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ తో సహ అనేక వ్యాపారాలు ప్రారంభించాడు.
మరో వైపు హెడ్లీ హెరాయిన్ వ్యాపారంలో చేరాడు. త్వరగా డబ్బు సంపాదించడానికి పాకిస్తాన్ నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలను తీసుకువచ్చాడు. 1988, 1997 లో హెరాయిన్ అక్రమ రవాణా ఆరోపణలపై రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. దోషిగా శిక్ష అనుభవించాడు.
ఇంటిని తాకట్టు పెట్టిన స్నేహితుడు
దర్యాప్తు అధికారుల ప్రకారం.. 1997 లో అమెరికాకు అక్రమంగా హెరాయిన్ రవాణా చేస్తూ హెడ్లీ పట్టుబడ్డాడు. అప్పుడు అతడి బెయిల్ కోసం రాణా తన ఇంటిని తాకట్టు పెట్టాడు.
హెడ్లీకి డబ్బులు అవసరమైనప్పుడల్లా కూడా రాణా తన అవసరాలను పక్కన బెట్టి మరీ డబ్బును పంపాడు. తరువాత వీరిద్దరి మార్గాలు వేర్వేరు దారుల్లోకి ప్రవేశించాయి. అయితే ఈ జంట ప్రపంచాన్ని భయపెట్టిన ఓ ఉగ్రవాద దాడి కోసం కలిశాయి.
హెడ్లీ మొదటిసారి దొరికనప్పుడు నాలుగు సంవత్సరాల పాటు, రెండో సారి 15 నెలల పాటు జైలు శిక్షకు గురయ్యాడు. రెండోసారి రాణా తన ఇంటిని బెయిల్ పూచీకత్తు కోసం తాకట్టు పెట్టాడు. అయితే దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించినందుకు అతడికి తక్కువ స్థాయిలో శిక్ష పడింది.
లష్కర్ ఏ తోయిబాకు రాణా గురించి సమాచారం ఇచ్చింది హెడ్లీనే. అతను ఇమ్మిగ్రేషన్ సెంటర్ లా సెంటర్ నిర్వహణ గురించి పూర్తి వివరాలు అందించడని కోర్టు పత్రాల్లో ఉంది.
‘‘రాణా వ్యాపారం వారి కార్యకలాపాలకు అనువైనదిగా ఉంటుందని హెడ్లీ అతని స్నేహితులు కూడా అంగీకరించారు. వీటి సాయంతో హెడ్లీ ఇండియాలో స్వేచ్చగా పర్యటించడానికి, శక్తివంతమైన నేతలతో సంబంధాలను ఏర్పచుకోవడానికి వీలు కల్పిస్తుంది’’ అని వారు భావించినట్లు కోర్టుపత్రాల్లో పేర్కొన్నారు.
రాణా కోసం ఎర
హెడ్లీకి ఇంతకుముందే ప్రమాదకరమైన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. అయితే రాణాకు దీనికి రావడానికి కారణం ఏంటీ? ఆయన చాలాకాలం క్రితమే పాకిస్తాన్ ను విడిచిపెట్టి కెనడియన్ పాస్ పోర్టుతో అమెరికాలో స్థిరపడ్డాడు.
పాకిస్తాన్ సైన్యం నుంచి పారిపోయిన సైనికుడిగా తన పేరును వాడుకుంటామని ఒప్పించినట్లు తెలిసింది. ఈ ఆఫర్ తరువాత రాణా తన బ్రాంచ్ ను ముంబైలో తెరవడానికి అంగీకరించాడు.
ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ ముంబై కార్యాలయంలో రీజినల్ మేనేజర్ గా రాణా హెడ్లీకి ఇండియాలో వ్యాపార వీసా ఇప్పించడంలో సాయం చేశాడు. ఆసియాలో కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి బాధ్యతలు హెడ్లీకి అప్పగించారు.
తప్పుడు సమాచారం..
వీసా దరఖాస్తులో హెడ్లీ తనకు తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలిసినప్పటికీ అతను దానిని సరిదిద్దలేదు. అతను తన వ్యాపార భాగస్వామి, ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ లోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదీని కూడా మోసం చేసి ఫారమ్ లను ఆమోదించేలా చేశాడు.
తన అనుమానించని వ్యాపార భాగస్వామి ద్వారా రాణా హెడ్లీ ముంబైలో ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ బ్రాంచ్ ఆఫీస్ ను తెరవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దరఖాస్తును పూర్తి చేయడంలో సాయం చేశాడు.
హెడ్లీ ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ ‘సౌత్ ఏషియన్ రీజినల్ డైరెక్టర్, ఆఫీస్ హెడ్ గా పనిచేస్తారని దరఖాస్తులో పేర్కొన్నారు. చివరకు బ్యాంకు ఆ దరఖాస్తును తిరస్కరించింది.
సాయం.. ప్రోత్సాహం
దేశంలో ఈ ఫోర్జరీ, మోసం ఆరోపణలు ముఖ్యమైనవి. రాణాపై ఈ ఆరోపణలపై అమెరికాలో ఎప్పూడు విచారణ జరగలేదు. కాబట్టి భారత కోర్టులు ‘‘డబుల్ జియోపార్టీ’’ అనే భావన నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా అతడిని విచారించవచ్చు. అంటే ఒకే అభియోగానికి ఒక వ్యక్తిని రెండుసార్లు విచారించకూడదు.
2006 సెప్టెంబర్ లో హెడ్లీ ముంబైకి వెళ్లి తాజ్ మహాల్ ప్యాలెస్, టవర్ హోటల్ రికార్డులో గంటల తరబడి వీడియో నిఘా నిర్వహించిన సమయంలో రాణాకు అత్యంత ఆప్తుడైన మరో వ్యక్తి హెడ్లీతో ఉన్నాడని కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి.
రాణా ఫోన్ చేయడంతో తాను వసతి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశానని ఆ వ్యక్తి తరువాత దర్యాప్తులో అంగీకరించాడు. 2007 లో హెడ్లీకి వీసా గడువు ముగియడంతో రాణా మళ్లీ ఇమ్మిగ్రేషన్ లా సెంటర్ ద్వారా కొత్త వీసా ఇప్పించాడు. రాణా సాయం కారణంగానే జూలై 18, 2007 హెడ్లీ భారత్ నుంచి ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ వీసాను పొందాడు.
దుబాయ్ లో సమావేశం..
2008 లో రాణా.. చైనా, దుబాయ్, ఇండియాలో పర్యటించాలని అనుకున్నాడు. ఈ విషయం రాణాకు తెలిసింది. అందుకే దుబాయ్ లోకి రాగానే భారత్ లో పర్యటించుకూడదనే చెప్పాడు. అక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతుందని చెప్పినట్లు యూఎస్ అధికారులు కోర్టుకు వెల్లడించారు.
ముంబై దాడుల తరువాత రాణా, హెడ్లీపై ఎఫ్ బీఐ నిఘా పెట్టినప్పుడు దుబాయ్ సమావేశం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 7, 2009 న రాణా, హెడ్లీ దుబాయ్ సమావేశం గురించి చర్చించారు. ఈ సంభాషణను ఎఫ్ బీఐ రికార్డు చేసింది. దీనిప్రకారం రాణాకు ముంబై దాడుల గురించి ముందే తెలుసు.
ఈ ఫోన్ సంభాషణలోనే దాడి చేసి చనిపోయిన తొమ్మిది మంది లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవం అయిన ‘‘నిషాన్ ఏ హైదర్’’ ను ఇవ్వాలని రాణా, హెడ్లీని కోరాడు.
రాణాను బలిపశువును చేసిన హెడ్లీ
ఎఫ్బీఐ రాణాను అరెస్ట్ చేసిన తరువాత అతని విచారణ మే 23, 2011 న ప్రారంభం అయింది. దీనిలో హెడ్లీ ప్రధాన ప్రాసిక్యూషన్ సాక్షిగా సమాధానం ఇచ్చాడు.
హెడ్లీ తనను తాను రక్షించుకోవడానికి రాణాను బలిపశువుగా చేసినట్లు భారత దర్యాప్తు సంస్థలు తెలిపాయి. కానీ దేశంలో ఉగ్రవాదానికి భౌతిక మద్దతు అందించడానికి కుట్రపన్నారనే అభియోగం నుంచి రాణాను జ్యూరీ నిర్దోషిగా ప్రకటించింది. కానీ డెన్మార్క్ లో ఉగ్రవాదానికి లష్కరేకు భౌతిక మద్దతు అందించడానికి కుట్ర పన్నారనే అభియోగంపై అతన్ని దోషిగా నిర్థారించింది.
పూర్తి స్థాయిలో ఆధారాలు లేక..
భారత్ పై ఉగ్రవాద దాడులకు సంబంధించిన కుట్రలో రాణాను దోషిగా నిర్ధారించేందుకు జ్యూరీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. జనవరి 14, 2013న అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తనను భారత్ ను అప్పగించడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన రాణా, తనకు విధించిన శిక్షపై ఎలాంటి అప్పీల్ చేయలేదు.
జూన్ 9, 2020 లో ఒక యూఎస్ న్యాయమూర్తి రాణా కారుణ్య నియామాకానికి అర్హుడని నిర్ధారించి అతని శిక్షను అనుభవించిన కాలానికి తగ్గించి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. కానీ భారత విజ్ఞప్తిపై వెంటనే అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అమెరికా జైళ్లలో మగ్గుతున్నాడు.
చాలా ఆలస్యం అయింది..
అమెరికాలో అరెస్ట్ అయిన వెంటనే హెడ్లీ దర్యాప్తు సంస్థలకు అబద్దం చెప్పాడు. తన చర్యల ఫలితంగా తన భార్య, మామ, సోదరుడు, తన ప్రాణ స్నేహితుడు రాణాను రక్షించుకునే ప్రయత్నం చేశాడని తరువాత తెలిసింది.
అయితే రాణా ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడని తెలిసిందో అప్పుడు రాణానే అందులో ఇరికించాడు. అబద్దం చెప్పడం ద్వారా ఇప్పుడు రాణాను రక్షించలేమని హెడ్లీ గ్రహించి ప్రాసిక్యూటర్లతో తన వాదన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఒకరకంగా రాణాను పూర్తిగా బలి ఇవ్వాలనుకోవడం.


Read More
Next Story