పాల్ పై పనిచేయని టైసన్ పంచ్.. చిత్తుగా ఓడిన మాజీ ఛాంపియన్
రింగ్ లోకి దిగాడంటే ప్రత్యర్థులకు హడల్.. ఎన్నో నాకౌట్ విజయాలు.. అయితే అవన్నీ పాతవి... చాలా కాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న టైసన్..
పాతతరం బాక్సింగ్ హీరో మైక్ టైసన్, యంగ్ బాక్సర్ జేక్ పాల్ తో జరిగిన బౌట్ లో ఓటమి పాలయ్యాడు. టెక్సాస్ లోని ఆర్లింగ్టన్ లోని AT&T స్టేడియంలో ఈ మ్యాచ్ లో జరిగింది. ప్రముఖ యూ ట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి తరువాత ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన జేక్ పాల్ టైసన్ పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇది 2024 లో జరిగిన అతిపెద్ద బాక్సింగ్ బౌట్ గా బాక్సింగ్ క్రీడా పంతులు విశ్లేషించారు.
మైక్ టైసన్ పై (58) వయస్సు ప్రభావం ఈ బౌట్ లో స్పష్టంగా కనిపించింది. పాల్ అన్నింటా చురుగ్గా కనిపించాడు. రింగ్ లో వేగంగా తిరుగుతూ టైసన్ ను ఇబ్బంది పెట్టాడు. ఎనిమిది రౌండ్ల మ్యాచ్ లో మొదటి రెండు రౌండ్లలో టైసన్ ఆధిపత్యం ప్రదర్శించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పాల్ ప్రత్యర్థి ఎత్తులన్నీ వమ్ము చేశాడు.
ఇంకా మిగిలే ఉంది..
పాల్ మూడవ రౌండ్ నుంచి టైసన్‌పై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించాడు. బౌట్ పై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించాడు. లెజెండరీ బాక్సర్ అయిన టైసన్ లయను అందుకోనివ్వకుండా పంచ్ లు విసిరాడు. 58 ఏళ్ల టైసన్, ఎనిమిది-రౌండ్‌ల బౌట్‌లో కేవలం ఒక పంచ్ మాత్రమే విసిరాడు. పాల్ మూడు కార్డులపై 80-72, 79-73, 79-73 భారీ తేడాతో గెలిచాడు.
మ్యాచ్ అనంతరం టైసన్ మాట్లాడుతూ.. తన పోరాటం ఇంకా మిగిలే ఉందని, ఇదే తన చివరి మ్యాచ్ కాదని అన్నారు. పాల్ కూడా టైసన్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. బాక్సింగ్ లో గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా కొనియాడాడు. మ్యాచ్ ముగిసిన కొన్ని నిమిషాల తరువాత టైసన్ కు నమస్కరించాడు.
పాల్ పంచులు..
యువకుడిగా ఉన్న జేక్ పాల్.. వృద్దాప్యంలో ఉన్న టైసన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అతడి వయస్సు కేవలం 27 సంవత్సరాలే కావడంతో రింగ్ లో చురుగ్గా కదిలాడు. ముఖ్యంగా మూడో రౌండ్ లో టైసన్ పై పంచుల వర్షం కురిపించాడు. దీనితో మాజీ వివాదాస్పద హెవీవెయిట్ ఛాంపియన్ ను ఇబ్బందుల్లో పడ్డాడు. ఫోర్బ్స్ ప్రకారం, మైక్ టైసన్ పోరాటం ద్వారా 20 మిలియన్ డాలర్లు పొందవలసి ఉంటుంది. జేక్ పాల్ మాత్రం 40 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నాడని సమాచారం.
క్రాష్ అయిన నెట్ ప్లిక్స్ ...
ఈ బౌట్ ను నెట్ ప్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ అతిపెద్ద లైవ్ స్పోర్ట్స్ కోసం లక్షలాది మంది ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ ను డౌన్ లోడ్ చేయడంతో సర్వర్ క్రాష్ అయింది. ఈ సందర్భంగా లైవ్ చూస్తున్న మిలయన్ల మంది నెట్ ఫ్లిక్స్ వినియోగదారులు నిరాశకు గురయ్యారు.
డౌన్‌డెటెక్టర్ ప్రకారం, వివిధ సోర్స్ ల నుంచి అందిన స్టేటస్ రిపోర్ట్‌లను క్రోడీకరించడం ద్వారా అంతరాయాలను ట్రాక్ చేసింది. ఈ సర్వర్ క్రాష్ తో న్యూయార్క్, సీటెల్, లాస్ ఏంజెల్స్‌తో సహా ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాలలోని వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. భారత్ లోని వినియోగదారులు సర్వర్ డౌన్ తో ప్రభావితమయ్యారు.
Next Story