
మక్కా మృతుల్లో ఎక్కువ మంది మల్లేపల్లి వాసులుగా అనుమానం
ప్రమాద స్థలానికి తరలి వెళ్లి సౌదీ సైన్యాధికారులు, పోలీసులు
మక్కా సమీపాన జరిగిన బస్సు ప్రమాదం గురించి కొద్దికొద్దిగా వివరాలు అందుతున్నాయి. అయితే అధికారికంగా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని, సౌదీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెల్లవడలేదు. అయితే, హైదరాబాద్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది నగరంలో మల్లే పల్లి ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. దీనికి సంబంధించి 16 మంది పేర్లు వినబడుతున్నాయి.
హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది పేర్లు: రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించినట్లు తెలిసింది. ఈకుటుంబాల గురించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
మృతుల గురించి సమాచారం అందించేందు భాతర కాన్సలేట్ జెద్దాలో ఒక సమాచారం కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఫోన్ నెంబర్లు: 8002440003 (Toll free)
In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgirms, a 24x7 Control Room has been set up in Consulate General of India, Jeddah.
— India in Jeddah (@CGIJeddah) November 17, 2025
The contact details of the Helpline are as under:
8002440003 (Toll free)
0122614093
0126614276
0556122301…
బస్సులో 42 మంది ఉమ్రా యాత్రికులు ఉన్నారని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు. తాను సౌదీ రాయబార కార్యాలయంతో సంప్రదిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రమాదం మీద భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు.
Deeply shocked at the accident involving Indian nationals in Medinah, Saudi Arabia.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 17, 2025
Our Embassy in Riyadh and Consulate in Jeddah are giving fullest support to Indian nationals and families affected by this accident.
Sincere condolences to the bereaved families. Pray for the…
.

