ISKON| చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారి అరెస్టును ఖండించిన MEA
x

ISKON| చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారి అరెస్టును ఖండించిన MEA

‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు సరికాదు. వారికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భద్రత కల్పించాలి’’ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్‌


ఇస్కాన్‌ (International Society for Krishna Consciousness)కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారి(Chinmoy Krishnadas)ని బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ (Ministry of External Affairs’ ) స్పందించింది. కృష్ణదాస్‌కు బెయిల్‌ నిరాకరించడంపై మన విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మచారి అరెస్టుపై బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందువులపై దాడులు సరికాదని పేర్కొంటూ.. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్‌ జైస్వాల్‌ బంగ్లాదేశ్‌ అధికారులను కోరారు.

బంగ్లాదేశ్‌లో తీవ్రవాద గ్రూపులు హిందువులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాయని..మైనార్టీల ఇళ్లపై దోపిడీకి పాల్పడడం, ఆలయాలను విధ్వంసానికి తెగబడుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. కృష్ణదాస్‌ అరెస్టు విషయాన్ని ఇస్కాన్‌ ఆలయ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయను విడిపించాలని కోరారు.

అరెస్టు ఎందుకు?

మీడియా కథనాల ప్రకారం.. కృష్ణదాస్‌ అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ జెండానుద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కృష్ణదాస్‌ మీదున్న అభియోగం. దీంతో ఢాకా పోలీసులు ఆయనను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరోవైపు అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి.

Read More
Next Story