అసెంబ్లీ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్డీఏ హవా..
x

అసెంబ్లీ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్డీఏ హవా..

పశ్చిమ రాష్ట్రం మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాలో మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో..


మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో మహారాష్ట్ర లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించగా, జార్ఖండ్ లో మాత్రం ఆధిక్యం చేతులు మారుతూ వస్తోంది. ఓ సారి కమలదళం, మరోసారి ఇండి కూటమి లీడ్ లోకి వస్తూ తుది ఫలితాలపై ఉత్కంఠ రేపుతోంది.

మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 208 స్థానాల్లో, మహా వికాస్ అఘాడి 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్‌లో ఎన్డీఏ 42 స్థానాల్లో, ఇండియా బ్లాక్ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
శివసేన, ఎన్‌సిపి వంటి ప్రాంతీయ శక్తులలో చీలిక తర్వాత గత రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి పరిపాలన పగ్గాలు చేపట్టి పాలించింది. పాలన కాలంలో మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడీ మధ్య తీవ్రస్థాయి రాజకీయ యుద్దం జరిగింది. మహాయుతిలో BJP, శివసేన (షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని NCP ఉన్నాయి, అయితే MVAలో కాంగ్రెస్, శివసేన (UBT), NCP (SP) లు ఉన్నాయి.
జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా?
జార్ఖండ్‌లో అధికార JMM నేతృత్వంలోని ఇండి కూటమి, BJP నేతృత్వంలోని NDA మధ్య భీకర ఎన్నికల పోరు జరుగుతోంది. రెండోసారి ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాలని జేఎంఎం కూటమి, గిరిజనుల బలంతో అధికారం దక్కించుకోవాలని కాషాయదళం ఎత్తులు, పొత్తులతో రాజకీయాలు నడిపాయి.
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రధానంగా అవినీతి, బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశాన్ని లెవనెత్తి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ప్రయత్నించింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
NDA అవినీతి మరియు చొరబాటుపై JMM నేతృత్వంలోని సంకీర్ణంపై దాడి చేసింది, బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ నాయకులను విమర్శించింది. హేమంత్ సోరెన్ తనపై "ద్వేషపూరిత ప్రచారాల" కోసం ప్రతిపక్ష పార్టీ రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆరోపిస్తూ, కుంకుమ శిబిరంపై విరుచుకుపడ్డారు.
ఉప ఎన్నికల కౌంటింగ్
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు 14 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. కేరళలోని వయనాడ్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక వాద్రా 82 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.



Read More
Next Story