స్వయం ప్రకటిత స్వామిజీ అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి..
x

స్వయం ప్రకటిత స్వామిజీ అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి..

ఇశాన్యేశ్వర దేవస్థాన్ ఆలయ అభివృద్ధికి 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1.05 కోటి మంజూరు


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్రలో అరెస్టయిన స్వయం ప్రకటిత స్వామిజీ అశోక్ కరాట్‌కు సంబంధించిన ఆలయానికి ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

అధికారిక పత్రాల ప్రకారం..నాసిక్ జిల్లాలోని ఇశాన్యేశ్వర దేవస్థాన్ ఆలయ అభివృద్ధికి 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1.05 కోట్లు ఇచ్చింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం‌లో పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ నిధులను ప్రాంతీయ పర్యాటక అభివృద్ధి పథకం కింద 2018 మార్చి 31న నిధులు మంజూరు చేసింది.

ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో హాలు నిర్మాణం, పేవింగ్ బ్లాక్‌లు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్, భక్తుల వసతి, తోట, విద్యుదీకరణ పనులు చేపట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.25 లక్షలు విడుదల చేశారు. ఈ పనులను ప్రజా పనుల శాఖ (PWD) నిర్వహించింది. నాసిక్ జిల్లాలో ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో ఈ ఆలయానికే అత్యధిక నిధులు కేటాయించారు.

ఇదిలా ఉండగా, ఖరత్‌పై అత్యాచార ఆరోపణలు నమోదయ్యాయి. 35 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మార్చి 18న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసు అదుపులో ఉన్నారు. ఆయనపై ఇప్పటివరకు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఐపీఎస్ అధికారి తేజస్వి సత్‌పుటే నేతృత్వంలో ఈ కేసును విచారిస్తోంది. దర్యాప్తులో ఖరత్‌కు సంబంధించిన 100కు పైగా అభ్యంతరకర వీడియోలు, సుమారు రూ.1,500 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఆదాయపు పన్ను శాఖ ఆయన ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తుండగా, సైబర్ పోలీసులు వీడియోలను విశ్లేషిస్తున్నారు. ఈ దర్యాప్తును మహారాష్ట్ర డీజీపీ సదానంద్ దాతే పర్యవేక్షిస్తున్నారు.

అయితే, అధికారులు స్పష్టం చేసినట్లు నిధులు మంజూరు చేసిన సమయంలో ఖరత్‌పై ఎలాంటి ఆరోపణలు లేవు. మత, పర్యాటక ప్రదేశాలకు నిధుల కేటాయింపు సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు.

Read More
Next Story