లక్నో టూ వారణాసి..వయా కోల్ కత, గువాహాటి.. పాపం కేకేఆర్..
x

లక్నో టూ వారణాసి..వయా కోల్ కత, గువాహాటి.. పాపం కేకేఆర్..

కోల్ కతలో నెలకొన్న బ్యాడ్ వెదర్ కారణంగా కేకేఆర్ ఆటగాళ్లు రాత్రిళ్లు నగరాల మీద చక్కర్లు కొట్టారు. తరువాత రోజు మ్యాచ్ లేకపోవడంతో..


ప్రతికూల వాతావరణం కారణంగా లక్నో నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానాన్ని చాలాసార్లు దారి మళ్లించి, చివరకు వారణాసిలో ల్యాండ్ చేశారు. ఈ కారణంగా ఆటగాళ్లు ఒకరాత్రి ఇక్కడే బస చేయాల్సి వచ్చింది.

ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 98 పరుగుల భారీ విజయం తర్వాత, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు సోమవారం సాయంత్రం 5:45 గంటలకు కోల్‌కతాకు బయలుదేరింది. ఈ బృందం రాత్రి 7.25 గంటలకు కోల్ కత రావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతాలో విమానాన్ని ల్యాండ్ చేయడం అసాధ్యం అయింది. దాంతో చార్టర్ ఫ్లైట్‌ను ముందుగా గౌహతికి, ఆ తరువాత వారణాసికి మళ్లించారు.
ఈ విషయాన్ని కేకేఆర్ మీడియా బృందం ప్రకటనలో తెలిపింది. "కోల్‌కత్తాలో ప్రతికూల వాతావరణం కారణంగా, KKR చార్టర్ విమానం గౌహతికి మళ్లించబడింది. మేము ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యాము." వివరించింది. తరువాత 9.43pmకి మరొక అప్‌డేట్‌లో, "మాకు ఇప్పుడు గౌహతి నుంచి కోల్‌కతాకు తిరిగి వెళ్లడానికి క్లియరెన్స్ వచ్చింది.
అయితే విమనాన్ని ఇక్కడ ల్యాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టాలు ఇంక తీరలేదు. ఇప్పుడు మేము వారణాసికి వెళ్తున్నాం’’ అని వెల్లడించింది. అర్ధరాత్రి ఒంటి గంటకు వారు ప్రయాణించిన విమానం వారణాసికి చేరుకుంది. KKR బృందం వారణాసిలో రాత్రి బస చేసి, ఈ మధ్యాహ్నం కోల్‌కతాకు పయనమవుతుంది. కేకేఆర్ తన చివరి మూడు మ్యాచ్ లను ముంబై ఇండియన్స్, గుజరాత్, రాజస్థాన్ లతో ఆడనుంది.
Read More
Next Story