పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు ఎల్‌పీజీ క్యారియర్..
x
Rajesh Kumar Sinha

పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు ఎల్‌పీజీ క్యారియర్..

ముడి చరుముతో మార్చి 14న యూఏఈ నుంచి బయలుదేరిన మరో నౌక ..


Click the Play button to hear this message in audio format

పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బయలుదేరిన భారతీయ ఎల్‌పీజీ నౌక సోమవారం భారత్ చేరుకోనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హార్ముజ్ జలసంధి సమీపంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికుల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.


ఈ సాయంత్రం భారత్‌కు ‘శివాలిక్’..

పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన భారతీయ ఎల్‌పీజీ క్యారియర్ ‘శివాలిక్’ హార్ముజ్ జలసంధిని దాటి భారతదేశం వైపు ప్రయాణిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నౌక సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో భారత తీరానికి చేరుకునే అవకాశం ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్షా మీడియా సమావేశంలో తెలిపారు.


భారతీయ నావికులు సురక్షితం..

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి పశ్చిమంగా 22 భారత జెండా నౌకలు ఉన్నాయని, వాటిలో మొత్తం 611 మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది.


ముడి చమురుతో మరో నౌక..

మార్చి 14న యూఏఈ నుంచి బయలుదేరిన భారత జెండా నౌక జాగ్ లడ్కీ (Jag Ladki) సుమారు 81 వేల టన్నుల ముర్బన్ ముడి చమురును తీసుకుని భారతదేశానికి ప్రయాణిస్తోంది. ఈ నౌకలోని సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నౌక రేపు ముద్రా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది.


దేశంలో ముడి చమురు కొరత లేదు..

దేశంలో ముడి చమురు కొరత లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అన్ని ఆయిల్ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎక్కడా ఇంధన కొరత నమోదు కాలేదని జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ పేర్కొన్నారు.


ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు..

ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నుంచి సుమారు 90 మంది భారతీయులు భూ మార్గం ద్వారా అజెర్‌బాగెన్‌లోకి ప్రవేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రక్రియను టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయం చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌‌ధీర్ జైస్వాల్ తెలిపారు. వీరికి వీసాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలలో సహాయం చేసినట్లు చెప్పారు.


విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు..

టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత నగరాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కొందరు ఇప్పటికే భారత్‌కు తిరిగి వచ్చారని, మరికొందరు రాబోయే రోజుల్లో స్వదేశానికి చేరుకుంటారని పేర్కొన్నారు.

Read More
Next Story