
లైట్ హౌస్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు
వైజాగ్ బీచ్‌లో లైట్ హౌస్ టూరిజం పండుగ!
థర్డ్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ విశాఖ సాగరతీరంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది.
మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న లైట్‌హౌస్ ఫెస్టివల్‌కు ఈ ఏడాది విశాఖ వేదికైంది. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ ఫెస్టివల్‌కు విశాఖ సాగరతీరంలోని ఏంజీఎం గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖల మంత్రి శర్వానంద్ సోనోవాల్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ఏం మాట్లాడారంటే?
ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు
విదేశీ పర్యాటకానికి వెళ్లనక్కర్లేదు..
‘భారతదేశంలోనే అత్యద్భుత పర్యాటక ప్రాంతాలున్నాయి. చక్కని, సుందరమైన, పురాతన, వారసత్వ నగరాలు, ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకలు అక్కడకు వెళ్లి ఆనందించండి. తద్వారా స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించండి. ఆ తర్వాతే ఇంకా ఏమైనా చూడాలంటే అప్పుడు విదేశాలకు వెళ్లండి. దేశంలోని లైట్ హౌస్‌లలో పర్యాటక హంగుల ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ లైట్ హౌస్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. ప్రధానికి కొంగొత్త ఆలోచనలు వస్తుంటాయి. అందుకే వాటిని ప్రోత్సహించమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ హౌస్‌లన్నిటినీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. దేశంలో 75 లైట్ హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తుండడం సంతోషాన్ని కలిగిస్తోంది. అమెరికాకు వైట్ హౌస్ ఉంటే మనకు 205 లెట్ హౌస్‌లున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింVŠ కంట్రీ అని ఐఎంఎఫ్ ప్రకటించింది. ఎక్కువ బహుళ జాతి సంస్థల్లో సీఈవోలు ఎక్కువ ఇండియన్లే ఉన్నారు. ఈ దేశం నిపుణుల ఘని. చాలామంది జ్ఞానవంతులున్నారు.
మాట్లాడుతున్న కేంద్రమంత్రి శర్వానంద్ సోనోవాల్
విశాఖ బ్యూటిపుల్.. ప్రజలు డ్యూటిఫుల్..
విశాఖపట్నం ప్రేమలో పడని వారుండారు. దీని అందాలను చూసి మనసు పడని వారూ ఉండరు. నేనీ ఊర్లో లా చదువుకున్నాను.. ఎమర్జెన్సీ కాలంలో 17 నెలలు విశాఖ జైలులోనే ఉన్నాను. వైజాగ్ ఓ డైనమిక్ సిటీ. విశాఖ బ్యూటిఫుల్.. ఇక్కడి ప్రజలు డ్యూటిఫుల్. బాధ్యతగా పని చేస్తారు. పాత రోజుల్లో లైట్‌హౌస్‌లు దిక్సూచిల్లా పనిచేశాయి. ఎయిర్ ట్రావెల్ లేదు. ప్రాచీనమైంది సముద్రయానమే. పోర్చుగీలు, ఇంగిలషువారు వచ్చింది సముద్రయానం ద్వారానే. మత్సా్యకారులు తిరిగి ఒడ్డుకు రావాలంటే లైట్ హౌస్‌లే దిక్సూచి. ఏపీలో 17 లైట్‌హౌస్‌ల్లో పదింటిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఏపీ తీర ప్రాంత పర్యాటకానికి కొత్త గుర్తింపు వస్తుంది’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
వెంకయ్యనాయుడుకు జ్ఞాపికను అందిస్తున్న కేంద్రమంత్రి సోనోవాల్
లైట్ హౌస్‌ల సందర్శన 500 శాతం పెరుగుదల..
లైట్ హౌస్ ఫెస్టివల్‌ను ఇప్పటివరకు 2023లో గోవాలో, 2024లో పూరీలో నిర్వహించాం. మూడవది ఇప్పుడు విశాఖలో జరుపుకుంటున్నామని కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్ అన్నారు. ‘దేశంలో 200కి పైగా లైట్ హౌస్‌లుండగా వాటిలో 75 ఐకానిక్ లైట్ హౌస్‌లను అన్ని హంగులతో పర్యాటకానికి వీలుగా తీర్చిదిద్దుతున్నాం. 2014లో దేశంలోని వివిధ లైట్ హౌస్‌లను సుమారు ఐదు లక్షల మంది సందర్శించగా ఇప్పడా సంఖ్య 20 లక్షలకు చేరింది. అంటే 500 శాతం పెరిగింది. 2030 నాటికి ఇండియా టాప్ షిప్ బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. విశాఖ వాసులు సౌమ్యులు, మంచివారు. విశాఖకు త్వరలో మారిటైమ్ యూనివర్సిటీ వస్తుంది. విశాఖపట్నం పోర్టు ప్రపంచంలోనే 20 ప్రఖ్యాత పోర్టుల్లో ఒకటిగా నిలిచింది. సాగరమాల కింద రూ.1.14 లక్షల కోట్లతో 110 ప్రాజెక్టులు చేపట్టాం. బ్లూ ఎకానమీలో లైట్ హౌస్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి’ అని కేంద్రమంతి సోనోవాల్ వివరించారు.
లైట్ హౌస్ టూరిజంపై ఫోకస్..
ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో లైట్ హౌస్ టూరిజంపై కూడా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. ‘రాష్ట్రంలో విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, పూడిమడక, నిజాంపట్నం, మచిలీపట్నం, వాకలపూడి సహా 17 లైట్æహౌస్‌లున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అద్బుత ప్రగతి సాధిస్తోంది. టెంపుల్ టూరిజంలో దేశంలోనే అత్యధికంగా తిరుపతికి భక్తుల తాకిడితో ఉంది. విశాఖ పోర్టు అథారిటీ లైట్ హౌస్‌ను కూడా పర్యాటక రంగంలోకి చేర్చడం ద్వారా పర్యాటకుల సంఖ్య పెరగడానికి దోహద పడుతుంది. లైట్‌హౌస్ టూరిజం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని లైట్ హౌస్‌ల వద్ద పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతాం’ అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తు తదితరులు పాల్గొన్నారు.
Next Story

