NH 44: కోడికొండ.. ఇక 10 వరసల బంగారు కొండ!
x
కోడికొండ చెక్ పోస్ట్ వద్ద నిర్మించనున్న మెలికల వంతెన (క్లోవర్ లీఫ్ ఇంటర్‌ఛేంజ్) ఊహాచిత్రం

NH 44: కోడికొండ.. ఇక 10 వరసల బంగారు కొండ!

361 కి.మీ, 6 గంటలు, అక్కడ రోడ్డెక్కితే ఇటు కర్నూలు అటు బెంగళూరే..


రాయలసీమలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు కోడికొండ జంక్షన్. ఎటుచూసినా హడావిడే.. అధికారులు సర్వేలు చేస్తున్నారు. సూపర్ వైజర్లు లెన్స్ పట్టుకుని ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుళ్లను చూస్తున్నారు. పనుల కోసం వర్కర్స్ పరుగులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్లు బారులు తీరుతున్నారు. దాబాల వాళ్లు అనువైన జాగాల కోసం వెతుకుతున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతమంతా సందడిసందడిగా ఉంది.

ఒకటా రెండా 10 వరసల రహదారి. రయ్, రయ్ న సాగే జాతీయ రహదారి. దాని పేరే జాతీయ రహదారి 44 (NH-44). 4,112 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే ఓ ముఖ్య భాగం. ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటక సరిహద్దులోని కోడికొండ (ఉమ్మడి అనంతపురం జిల్లా) వద్ద ప్రవేశిస్తుంది. ఇది అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణిస్తూ తెలంగాణ సరిహద్దు వరకు వెళుతుంది.
మరోపక్క, కోడికొండ చెక్-పోస్ట్ దగ్గర నుంచి ఏవైపునకు వెళ్లాలంటే ఆ వైపు వెళ్లవచ్చు. NHAI అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని కోడికొండ నుండి ముప్పవరం వరకు 342 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.
కొత్త రహదారితో పాటు, NH-44లో బెంగళూరు - కోడికొండ మధ్య, అలాగే NH-16లో అద్దంకి - విజయవాడ మధ్య ఉన్న పాత రహదారులను కూడా అభివృద్ధి (బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్) చేస్తారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే బెంగళూరు, విజయవాడ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 11–12 గంటల నుండి 6–7 గంటలకు తగ్గుతుందని NHAI ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
నిర్మాణ శైలి: మధ్యలో 6 వరుసలు వేగవంతమైన ప్రయాణానికి (Main Carriageway), ఇరువైపులా రెండేసి వరుసల చొప్పున 4 వరుసలు సర్వీస్ రోడ్ల కోసం కేటాయిస్తారు. దీనివల్ల స్థానిక వాహనదారులకు భద్రత పెరుగుతుంది.
అనుసంధానం: కోడికొండ వద్ద నిర్మించే 'క్లోవర్ లీఫ్ ఇంటర్‌ఛేంజ్' ద్వారా అటు బెంగళూరు-హైదరాబాద్ హైవేకి, ఇటు కొత్తగా వచ్చే బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేకి సులువుగా చేరుకోవచ్చు.

దూరాలు తగ్గుతాయి.. అభివృద్ధి పెరుగుతుంది
ఈ ప్రాజెక్టు పూర్తయితే బెంగళూరు నుండి విజయవాడకు ప్రయాణ సమయం 11 గంటల నుండి కేవలం 6-7 గంటలకు తగ్గుతుంది.
కర్నూలు - బెంగళూరు: 361 కి.మీ దూరాన్ని కేవలం 6 గంటల్లోనే చేరుకోవచ్చు.
ఆర్ధిక ప్రయోజనాలు: రహదారి విస్తరణతో చిక్కబళ్లాపుర, అనంతపురం జిల్లాల్లో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, విద్యా సంస్థలు పెరగనున్నాయి. నంది హిల్స్, ఈషా ఫౌండేషన్ వంటి పర్యాటక ప్రాంతాలకు తాకిడి పెరుగుతుంది.
పనుల పురోగతి:
సుమారు రూ. 2,580 కోట్లతో ఈ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే మెజారిటీ భూమి NHAI ఆధీనంలో ఉండటంతో పనులు వేగవంతం కానున్నాయి. నాలుగు నెలల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి, ఈ 10 వరుసల రహదారి రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా, హైదరాబాద్ - బెంగళూరు - విజయవాడ నగరాల మధ్య వారధిగా నిలవనుంది.

కేంద్ర ప్రభుత్వ 'భారత్‌మాల పరియోజన' కింద నిర్మిస్తున్న బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ రహదారి రూపుదిద్దుకుంటోంది. కోడికొండ వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమవుతుంది.

కోడికొండ నుంచి ఎలా వస్తుందంటే...

జాతీయ రహదారి NH 44, ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటక సరిహద్దులోని కోడికొండ (ఉమ్మడి అనంతపురం జిల్లా) వద్ద ప్రవేశిస్తుంది. ఇది అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణిస్తూ తెలంగాణ సరిహద్దు వరకు వెళుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో NH 44 వివరాలు..
ప్రవేశ స్థానం (దక్షిణం): కోడికొండ చెక్-పోస్ట్ దగ్గర
ప్రధాన నగరాలు: అనంతపురం, కర్నూలు.
నిష్క్రమించే చోటు (ఉత్తరం): తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వైపు (కర్నూలు సమీపంలో).
అనంతపురం జిల్లాలోని కోడికొండ నుండి అనంతపురం మీదుగా గుత్తి వరకు, కర్నూలు జిల్లాలో గుత్తి నుంచి కర్నూలు నగరం మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ 162 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గంగా ఉంది. కొడికొండ నుంచి అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ వైపు ఉన్న ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
రాయలసీమ ప్రాంతానికి గొప్ప ఊరట
ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. హైదరాబాద్-బెంగళూరుతో పాటు కొడికొండ నుంచి కడప మీదుగా విజయవాడ వైపునకు అనుసంధానం ఏర్పడుతుంది.

పది లైన్ల రూటు వస్తే రహదారికి ఇరువైపులా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయి. ఆతిథ్య రంగం కూడా పెరుగుతుంది. అయితే, NH-44 దశపథ రహదారిగా మారితే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇది ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయనుంది.
భూసేకరణ, పనులు..
రహదారి విస్తరణకు అవసరమైన మెజారిటీ భూమి ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఆధీనంలో ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల కోసం మాత్రమే కొన్ని చోట్ల అదనపు భూసేకరణ జరుగుతోంది. రహదారి వెంబడి ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు, కొలతల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ.. "NH-44 దశపథ రహదారిగా మారడం వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. సుమారు రూ. 2,500 కోట్ల వ్యయంతో జరిగే ఈ పనులకు సంబంధించి మరో నాలుగు నెలల్లో టెండర్లు పిలుస్తాం" అని తెలిపారు.
Read More
Next Story