కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు: రాజకీయ కుట్రగా అభివర్ణించిన కేజ్రీవాల్
x

కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు: రాజకీయ కుట్రగా అభివర్ణించిన కేజ్రీవాల్

కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతరులకు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అనంతరం, కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి బీజేపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కోర్టు తీర్పును స్వాగతించారు. నిజం ఎప్పుడూ గెలుస్తుందన్నారు. ఆప్ పంజాబ్ అధ్యక్షుడు అమన్ అరోరా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ స్వప్రయోజనాలకు వాడుకుంటుందని ఆరోపించారు. తీర్పు తర్వాత కేజ్రీవాల్ నివాసంలో పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసు నేపథ్యం..

గతంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం.. మద్యం విక్రయాల విధానాన్ని సులభతరం చేయడం, మద్యం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడం కోసం కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో అవినీతి, అక్రమాల చోటుచేసుకున్నాయని కేజ్రీవాల్, సిసోడియా సహా మరికొంతమందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆప్ ముఖ్య నేతలు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది. దీంతో నిందితులను కోర్టు విడుదల చేసింది.

హైకోర్టులో సీబీఐ అప్పీల్..

కోర్టు తీర్పుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నారు. "దర్యాప్తులోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల నిందితులను విడుదల చేసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్తాం" అని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.

Read More
Next Story