బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్
యూకే బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ తరుపున గెలిచిన 61 ఏళ్ల స్టార్మర్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
యూకే బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్ ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ తరుపున గెలిచిన 61 ఏళ్ల స్టార్మర్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. మొత్తం 650 స్థానాలకుగాను 412 స్థానాలను లేబర్ పార్టీ దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీకి 121 స్థానాలొచ్చాయి. మిగతా ఆరు పార్టీలు 117 స్థానాలు కైవసం చేసుకున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న లేబర్ పార్టీ .. 14 ఏళ్ల తర్వాత మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుంది.
స్టార్మర్ కుటుంబనేపథ్యం..
సర్రే అనే చిన్నపట్టణంలో జన్మించిన స్టార్మర్.. వృత్తిరీత్యా న్యాయవాది. తండ్రి రోడ్నీ టూల్ మేకర్.. తల్లి జోసెఫైన్ సాధారణ నర్సు. అరుదైన ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతూ కన్నుమూశారు. తండ్రి మూడేళ్ల క్రితం మరణించాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్టార్మర్..లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి 2015 ఎన్నికల్లో లండన్ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. భార్య పేరు విక్టోరియా. నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగంలో ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం.
రాజకీయాల్లో అంచెలంచెలుగా..
ఒక సంవత్సరం పాటు బ్రిటన్ షాడో క్యాబినెట్‌లో ఇమ్మిగ్రేషన్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2020 వరకు యూరోపియన్ యూనియన్ షాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా కూడా ఉన్నారు. ఏప్రిల్ 2020లో లేబర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత బ్రిటిష్ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.