కాలిఫోర్నియా సుపీరియర్ జడ్జిగా తెలుగు మహిళ!
x

కాలిఫోర్నియా సుపీరియర్ జడ్జిగా తెలుగు మహిళ!

విదేశా న్యాయవ్యవస్థలో కూడా భారతీయ మహిళ మెరిసింది. అందుకు జయ బాడిగ నిదర్శనం. కాలిఫోర్నియా సుపీరియర్ జడ్జిగా ఆమె నియమితులయ్యారు. ఇంతకీ ఆమె ఎవరంటే..


మన భారతీయులు ఇక్కడ కన్నా విదేశాల్లో మెరుస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని టాప్ సంస్థల్లో అత్యధిక కంపెనీలకు భారతీయులే చీఫ్‌లుగా పనిచేస్తున్నారు. తాజాగా న్యాయవ్యవస్థలో కూడా భారతదేశానికి చెందిన నారీమణి ఒకరు మెరిశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మహిళ మన దేశస్తురాలే కాదు మన తెలుగు మహిళ కూడా. ఆమే.. జయ బాడిగ. విజయవాడకు చెందిన ఈమెను సుపీరియర్ జడ్జిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో ఆమె పేరు మన దేశమంతా పెనమోగిపోతోంది. విదేశీ నేలపై అందులోనూ న్యాయవ్యవస్థలో మెరిసిన తెలుగు మహిళకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

తొలి మహిళగా కీర్తి

అయితే ఎంతో మంది భారతీయ సంతతి మహిళలు విదేశాల్లో న్యాయవ్యవస్థలో పనిచేస్తున్నారు. కానీ కాలిఫోర్నియా శాక్రమెంటో సుపీరియర్ జడ్జిగా ఎంపికైన తొలి తెలుగు మహిళ జయ నిలిచారు. న్యాయం చేయడం పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ వల్లే ఆమెను ఇప్పుడు ఈ పదవి వరించిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.

ఎంతో మందికి మార్గదర్శకురాలు

జయ బాడిగ.. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు ప్రయాణించారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఆమె ఫ్యామిలీ లా నిపుణురాలిగా గుర్తింపు కూడా పొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలోని అనేకమంది మార్గదర్శకంగా నిలిచారు జయ.

జయ నేపథ్యం

జయ బాడిగ స్వస్థలం విజయవాడ. ఆమె విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. 1991-1994 మధ్య ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలీ, పొలిటికల్ సైన్స్‌తో బీఏ పూర్తి చేశారు. ఉన్న చదువుల కోసమని అమెరికా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడ్డారు. అక్కడే బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత శాంటాక్లారా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు.

2009లో ఆమె కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అప్పటి నుంచి దాదాపు పదేళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించారు. యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రయల్ అడ్వకసీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా మెక్‌జార్జ్ లా స్కూల్‌లో అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు. అయితే తాజాగా న్యాయమూర్తులగా ఎంపికైన వారిలో జయతో పాటు భారత సంతతికి చెందిన రాజ్ సింగ్ బధేషా కూడా ఉన్నారు. వీరితో సహా మొత్తం 18 మందిని తాజాగా న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు గవర్నర్ న్యూసోమ్ ప్రకటించారు.

Read More
Next Story