
'పెళ్లి కానుక ఇవ్వనాయన మూడో బిడ్డకు డబ్బిస్తాడా!'
బీఆర్ నాయుడిపై ఏం చేశావు బాబు అంటూ జగన్ సెటైర్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లు పేల్చారు. ముఖ్యమంత్రి కళ్లార్పకుండా అబద్దాలు చెబుతారని, పవన్ కల్యాణ్ ఆయన్ను జాకీలు పెట్టి లేపుతారని, పెళ్లయిన జంటకు ఇస్తానన్న డబ్బు ఇవ్వనాయన మూడో బిడ్డకు ఇస్తాడా.. ఇలా అనేక సందర్భాలలో జోకులు వేశారు.
తాడేపల్లిలో ఇవాళ ఆయన సుదీర్ఘ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన పలువురి పేర్లను ప్రస్తావించారు.
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?
కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?
మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌మీద ఏం చర్యలు తీసుకున్నారు?
టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?
మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.
తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.
దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు వైఎస్ జగన్.
Next Story

