బాబు కప్పం కట్టలేక పారిపోతున్నాయి..ఆర్‌బీఐ రిపోర్టుతో జగన్ కౌంటర్
x

బాబు 'కప్పం' కట్టలేక పారిపోతున్నాయి..ఆర్‌బీఐ రిపోర్టుతో జగన్ కౌంటర్

పరిశ్రమలు పారిపోయింది తమ హయాంలో కాదని ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనే పారిపోతున్నాయని జగన్ కౌంటర్ ఇచ్చారు.


"మా హయాంలో పరిశ్రమలు పారిపోయాయని టన్నుల కొద్దీ బురద జల్లిన సీఎం చంద్రబాబు నాయుడు నోరు మూయించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఐదో స్థానంలో, దక్షిణాదిలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత మాది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబుకు 'కప్పం' కట్టలేక దిగ్గజ పారిశ్రామికవేత్తలే భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది" అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

2025 డిసెంబర్ 11న ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదికను జగన్ ప్రస్తావించారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జీవీఏ (Gross Value Added)లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉందని, ఇది తన పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, తనపై విషప్రచారం చేస్తూ చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి పేర్లను జగన్ బహిరంగంగా చదివి వినిపించారు. "సచిన్ జిందాల్, మైహోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్ కో, దాల్మియా, భారతి సిమెంట్స్.. ఇలా ఏ జిల్లాలోనైనా పరిశ్రమ నడపాలంటే చంద్రబాబుకు కప్పం కట్టాల్సిందే. లేదంటే వేధింపులు తప్పడం లేదు " అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More
Next Story