ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకరదాడి: యుద్ధం మొదలైనట్టేనా?
x

ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకరదాడి: యుద్ధం మొదలైనట్టేనా?

ఇరాన్ మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున (అక్టోబర్ 26,2024) దాడులు ప్రారంభించింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మొదలైందా అనే ఆందోళన మొదలైంది.


ఇరాన్ మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున (అక్టోబర్ 26,2024) దాడులు ప్రారంభించింది. అక్టోబర్ 1న ఇజ్రాయిల్ పై ఇరాన్ చేసిన దాడులకు ప్రతిగా ఈ దాడులు ప్రారంభమైనట్టు అంచనా. ఇవి కచ్చితంగా ప్రతికార దాడులే అంటున్నారు ఇరాన్ వాసులు. నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు జరిగాయి. అక్టోబర్ 1న ఇరాన్ దాదాపు 2 వందలకు పైగా ఖండాంతర క్షిపణులను (మిసైల్స్)ను ఇజ్రాయిల్ మిలిటరీ స్థావరాలపై ప్రయోగించింది. గత ఆరు నెలల కాలంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ జరిపిన రెండో దాడి అది.

ఈ దాడులు జరిగినపుడే ఇజ్రాయిల్ ఇరాన్ ను హెచ్చరించింది. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికకు అనుగుణంగానే 26 రోజుల తర్వాత ఇప్పుడు దాడులు చేసింది.
“ ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు ప్రతికారంగా దాడులు చేశాం. ఇరాన్ మిలిటరీ కేంద్రాలను నిర్దిష్టంగా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాం” అని ఇజ్రాయిల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దాడులు జరిగిన వెంటనే ఇజ్రాయిల్ కూడా స్పందించింది. ఇరాన్ తో పాటు దానికి మద్దతు ఇస్తున్న కీలుబొమ్మలు కూడా ఇజ్రాయిల్ గురి నుంచి తప్పించుకోలేవు అని ఇజ్రాయిల్ ప్రకటించింది. పరస్పర దాడులు చేసుకుంటే పరిస్థితి ఏవైపునకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అక్టోబరు 26, శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ "సైనిక లక్ష్యాలపై" ఇరాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. అక్టోబర్ 1న ఇరాన్ తన భూభాగంపై బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లేదా ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్‌లో జరిగిన నష్టంపై తక్షణ సమాచారం అందలేదు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఇరాక్ విమానాల రాకపోకలను నిలిపివేసింది. వారం రోజులుగా ఇజ్రాయెల్ ఈ తరహా బెదిరింపులు చేస్తూనే వచ్చింది. అక్టోబర్ 26న దాడులకు దిగింది. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రాంతీయ యుద్ధం అంచుకు చేరుకున్నాయి. గత ఏడాది హమాస్ దాడి తరువాత, ఇజ్రాయెల్- గాజా స్ట్రిప్‌లో ప్రత్యక్ష భూదాడిని ప్రారంభించింది. పొరుగున ఉన్న లెబనాన్‌పై దాడి చేసింది.
ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్‌పై దాడి చేసింది?
ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ భూభాగంపై చేసిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ రోజు ఇరాన్ మిలిటరీ స్థావరాలపై దాడి చేసింది. వైమానిక దాడులు జరిగిన వెంటనే, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రత్యక్షంగా ప్రవేశించిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ప్రతీకార దాడి గురించి ఇరాన్‌కు ఇజ్రాయెల్ నిరంతరం హెచ్చరికలు చేస్తున్నందున ఈ దాడి ఆశ్చర్యం కలిగించలేదని అంటున్నారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అక్టోబరు ప్రారంభంలో వైమానిక దాడుల గురించి కొన్ని సైట్లలో ప్రస్తావించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు.

1979లో ఇరాన్ విప్లవం తర్వాత ఈ రెండు దేశాల మధ్య విభేదాలు నెలకున్నాయి. ఇరాన్ విప్లవం తర్వాత అమెరికాకు ఏమాత్రం సహకరించని ఇస్లామిక్ ప్రభుత్వం ఇరాన్ లో ఏర్పడింది.
ఇజ్రాయెల్ సైన్యం శనివారం జరిపిన దాడి ప్రభావం ఎంత అనేది ఇంకా ఖచ్చితంగా తేలలేదు. అక్టోబర్ 7 నుంచి ఇరుదేశాల మధ్య పరస్పర హెచ్చరికలు సాగుతున్నాయి. అక్టోబర్ 26నాటికి ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మ్ డేనియల్ హగారి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్ధం వినిపించింది. ప్రభుత్వ మీడియా కూడా ఈ పేలుళ్లను ధృవీకరించింది. నగరం చుట్టూ మోతలు వినిపిస్తున్నాయి. పేలుళ్లతో దుమ్ము ధూళి ఆకాశాన్ని అంటుతున్నాయి అని ఇరాన్ వాసులు చెబుతున్నారు. శనివారం ఇజ్రాయెల్ రాకెట్ దాడుల తర్వాత కనీసం ఏడు ప్రాంతాలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని టెహ్రాన్‌ నివాసి ఏపీ వార్తా సంస్థకి తెలిపారు.
ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనున్న సిరియాలోనూ వైమానిక భద్రతను పెంచారు.
అక్టోబరు 1న, ఇరాన్ ఇజ్రాయెల్‌పై హై-స్పీడ్ క్షిపణి బారేజీలను ప్రయోగించింది. ఇజ్రాయిల్ పై టెహ్రాన్ చేసిన అతిపెద్ద దాడి అదే. ఇప్పుడు ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది.
2023 అక్టోబర్ 7 నుంచి ఈ ప్రాంతాల్లో జరుగుతున్న దాడుల్లో ఇప్పటికి కొన్ని వేల మంది చనిపోయారు.
Read More
Next Story