ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణ దాస్‌కు దక్కని బెయిల్
కృష్ణ దాస్ ఒక ర్యాలీలో జాతీయ జెండాను అవమానించారని మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత ఖలీదా జియా ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ ((ISKCON)) ప్రచారకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) కు బెయిల్ దొరకలేదు. బెయిల్ కోసం 11 మంది న్యాయవాదుల బృందం వాదనలు వినిపించింది. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం అరగంటపాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు. వాదనల నేపథ్యంలో కోర్టు వద్ద భద్రతను పెంచారు. కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడు కృష్ణ దాస్‌కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.
అక్టోబర్ 25న బంగ్లాదేశ్‌లో కృష్ణ దాస్ ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపర్చారంటూ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే సంస్థ చిన్మోయ్ తరఫున వాదించేందుకు 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.
Next Story