అమరావతికి బిల్ ’గేట్స్ గిఫ్ట్‘ ఇదేనా?
x
సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతికి బిల్ ’గేట్స్ గిఫ్ట్‘ ఇదేనా?

సరిహద్దులు దాటిన చంద్రబాబు-బిల్ గేట్స్ మ్యాజిక్.


రెండు దశాబ్దాల క్రితం.. గన్నవరం నుంచి హైటెక్ సిటీ వరకు సాగిన ఒక కలయిక తెలుగు నేల తలరాతను మార్చేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అదే గన్నవరం గడ్డపై పొగమంచు తెరలను చీల్చుకుంటూ ల్యాండైన బిల్ గేట్స్ విమానం, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సరికొత్త ఆశలకు ఊపిరి పోసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, బిల్ గేట్స్ దాతృత్వం మమేకమైతే.. అది కేవలం చర్చలకే పరిమితం అవుతుందా లేక ఏపీ సామాన్య రైతుకు, పేదవాడి ఆరోగ్యానికి ఒక డిజిటల్ వరంలా మారుతుందా? అమరావతికి గేట్స్ గిఫ్ట్ ఇదేనా? అన్న ఉత్కంఠ మధ్య, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా సాగుతున్న ఈ హైప్రొఫైల్ పర్యటన ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు వల్ల విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టడం నుంచి సచివాలయం వరకు సాగిన ఈ పర్యటన వెనుక.. ఏపీ సామాన్యుడి రాత మార్చే మూడు ప్రధాన బహుమతులు ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు ఆత్మీయ కరచాలనం

రైతు చేతికి డ్రోన్.. పళ్ళెంలో ఆరోగ్యకరమైన ఆహారం
బిల్ గేట్స్ ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించింది వ్యవసాయంపైనే. కేవలం ఉండవల్లి పొలాల్లో పర్యటించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సాగును ఎలా లాభసాటిగా మార్చవచ్చో ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఏపీలోని ప్రతి రైతుకూ తక్కువ ధరకే డ్రోన్ టెక్నాలజీ అందేలా, తెగుళ్ళను ముందుగానే గుర్తించే సాఫ్ట్‌వేర్లను గేట్స్ ఫౌండేషన్ ఉచితంగా లేదా రాయితీపై అందించే అవకాశం ఉంది. ఇదే జరిగితే, మన రైతులకు అది అతిపెద్ద డిజిటల్ గిఫ్ట్ కానుంది.

బిల్ గేట్స్ కి స్వాగతం పలుకుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
సంజీవనితో పేదవాడి ముంగిట కార్పొరేట్ వైద్యం
గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఏపీలో సంజీవని ప్రాజెక్టు ద్వారా ఆరోగ్య రంగంలో సహకరిస్తోంది. అయితే ఈ పర్యటన తర్వాత, ఆ సహకారం మరింత విస్తరించనుంది. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల వంటి ప్రమాదకర జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించే స్క్రీనింగ్ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా గేట్స్ వరాలు ప్రకటించవచ్చు. మెడ్‌టెక్ జోన్‌లో తయారయ్యే వైద్య పరికరాలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే బాధ్యతను ఫౌండేషన్ తీసుకునే అవకాశం ఉంది.

నాడు హైటెక్.. నేడు ఆర్టీజీఎస్ పాలనలో గ్లోబల్ సర్టిఫికేట్
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ని సందర్శించాలని అనుకోవడం ద్వారా బిల్ గేట్స్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం డేటాను వాడుతున్న తీరును ఆయన మెచ్చుకోవడం అంటే, అది ప్రపంచ దేశాల ముందు ఏపీ పాలనకు లభించిన అతిపెద్ద గుర్తింపు. గేట్స్ ఫౌండేషన్ తన నెట్‌వర్క్ ద్వారా ఏపీ ప్రభుత్వ డేటా మోడల్ ను ఇతర దేశాల్లో కూడా అమలు చేసేలా ప్రచారం కల్పిస్తే, అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల ప్రవాహం పెరగడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

స్వర్ణాంధ్రకు కొత్త రూపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రెజంటేషన్ ద్వారా గేట్స్ బృందానికి రాష్ట్ర అవసరాలను స్పష్టంగా వివరించారు. కేవలం నిధులు మాత్రమే కాకుండా, గేట్స్ ఫౌండేషన్ వద్ద ఉన్న మేధోసంపత్తిని (Expertise) రాష్ట్రానికి మళ్లించడమే ఈ పర్యటన అసలైన ఉద్దేశం. రెండు దశాబ్దాల క్రితం మైక్రోసాఫ్ట్ సెంటర్‌ను హైదరాబాద్‌కు తెచ్చి నగరాన్ని ఎలా మార్చారో, ఇప్పుడు అమరావతిని అలాగే మార్చే మాస్టర్ ప్లాన్ ఈ పర్యటనలో దాగి ఉందని స్పష్టమవుతోం.
Read More
Next Story