‘క్వాడ్’ కథ కంచికేనా?
చైనాతో ఉన్న విబేధాలపై భారత్, అమెరికా అనుసరిస్తున్న విధానాలు చెబుతున్నదేమిటీ?
ట్రంప్ 2.0 ప్రభుత్వం కొలువుదీరగానే ఆయన మొదటిసారిగా అధికారంలో ఉండగా ఏర్పాటు అయిన క్వాడ్ కూటమిలో కదలిక ఆక్టీవ్ గా ప్రారంభం అయింది. ఈ వారంలో వాషింగ్టన్ డీసీలో క్వాడ్ దేశాల విదేశాంగమంత్రులు సమావేశం అయ్యారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా కదలికలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం లభించింది. కానీ చైనా ను ఏవిధంగా కంట్రోల్ చేయాలో మాత్రం సమావేశం లో స్పష్టంగా నిర్ణయానికి రాలేకపోయారు.
భారత్ ఆశలు..
ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగమంత్రులతో పాటు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రుబియో పాల్గొన్నారు. ఇందులో భాగస్వామ్య దేశాలకు ఆయన అమెరికా తరఫున హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే క్వాడ్ మీటింగ్ జరగడం, అందులో సభ్య దేశాలన్నీ పాల్గొనడం, అమెరికా తన సందేశాన్ని చెప్పడం చైనా పై వాషింగ్టన్ అనుసరించబోయే వైఖరిని తెలియజేస్తోంది.
లెక్కలు సరిచేయాలని అనుకుంటున్నారా?
అధ్యక్షుడు ట్రంప్, చైనా పై ఇంతకుముందు జో బైడెన్ అనుసరించిన విధానాలనే అనుసరిస్తారా? లేదా కొత్త విధానం తీసుకుంటారా? అనే విషయంలో విశ్లేషకులు సరైన అంచనాకు రాలేక పోతున్నారు. ప్రపంచంలో ఇప్పుడు అమెరికాను సవాల్ చేయబోయే ఏకైక దేశం చైనానే అనడంలో సందేహం లేదు. అయితే కొన్ని వ్యాఖ్యలు కొన్ని అంశాలను తీసుకుంటే కమ్యూనిస్ట్ దేశంతో డిఫరెంట్ అప్రోచ్ తీసుకుకోనున్నట్లు తెలుస్తోంది.
తన ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను ట్రంప్ ఆహ్వనించారు. కానీ ఆయన హజరుకాక, ఉప అధ్యక్షుడు హాన్ జెంగ్ ను పంపారు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా ప్రమాణస్వీకారానికి చైనానే పిలిచే సాంప్రదాయం వాషింగ్టన్ కు లేదు. ఇప్పడు ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించింది.
అలాగే ఎప్పుడూ అమెరికా నేతల ప్రమాణ స్వీకారాని చైనా హజరుకాలేదు. కొని ఈ సారి తన ప్రతినిధిని పంపింది. ఎవరూ ఏ వ్యూహంతో ఉన్నారో అర్థం కావడం కష్టంగా ఉంది. ట్రంప్- షీ జిన్ పింగ్ ఇద్దరు కూడా తమ దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పట్టుదలగానే ఉన్నారు కానీ దాన్ని ఎలా కలుపుకుంటారనే విషయంలో మాత్రం ఇద్దరు స్పష్టత ఇవ్వలేదు.
ఫ్రీ ట్రేడ్.. ఇండో- పసిఫిక్..
క్వాడ్ మీటింగ్ లో విదేశాంగ మంత్రుల సమావేశం ముగిశాక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ దేశాల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమన్యాయం, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చాయి. అలాగే బలవంతంగా సరిహద్దులను మార్చడాన్ని, ఆక్రమించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. క్వాడ్ కూటమి ఇక నుంచి తప్పనిసరిగా సమావేశం కావాలని, తదుపరి భారత్ లో నిర్వహించబోయే సదస్సు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సభ్య దేశాలు నొక్కి చెప్పాయి.
మోదీ- ట్రంప్ భేటీ క్వాడ్ లోనేనా?
నిజానికి గత ఏడాది డెలావర్ లో నిర్వహించిన క్వాడ్ సదస్సు భారత్ లో జరగాల్సి ఉండే.. కానీ బైడెన్ అభ్యర్థనతో దాన్ని అమెరికాలో నిర్వహించారు. కావునా వచ్చే క్వాడ్ సదస్సు న్యూ ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి దేశాధ్యక్షులు హజరయ్యే అవకాశం ఉంది కావునా.. ట్రంప్.. మోదీ భేటీ అప్పుడే జరగుతుందని తెలుస్తోంది. ‘‘ అస్థిర, అనిశ్చిత ప్రపంచంలో క్వాడ్ సదస్సు ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది’’ అని ఎస్ జైశంకర్ అన్నారు. కాబట్టి భారత్ కూడా ఇక ముందు క్రియాశీలక పాత్ర తీసుకుంటుందా? చూడాలి.
ట్రంప్.. భారత్ ను అప్ సెట్ చేస్తాడా?
గత ఏడాది నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు పరిపాలన కాలంలో ఇద్దరి మధ్య సఖ్యత బాగా కుదిరింది. అలానే ఇప్పుడు కూడా జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి మాత్రం మోదీకి ఆహ్వానం పంపలేదు. కేవలం అర్జెంటీనా, ఇటలీ వంటి దేశాధినేతలకు మాత్రమే ఇన్విటేషన్ పంపారు. దౌత్య సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ట్రంప్, మోదీ తో కొన్ని అంశాల్లో విబేధించారని.
అందుకే విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కొన్ని వారాలుగా అమెరికా లో ఉంటూ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. అమెరికాతో ఏర్పడిన గ్యాప్ ను ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియోతో సమావేశం అయ్యారు. ఇక్కడ మనకో విషయం అర్థం కావాలి.. అమెరికా విషయంలో క్వాడ్ ద్వారా చైనా తో వ్యవహరం, అలాగే భారత్ స్వంతంగా చైనాతో బంధాలు ముందుకు కొనసాగించే విషయంలో ఇప్పుడు న్యూఢిల్లీకి సవాల్ ఎదురుకాబోతోంది.
ట్రంప్ మిస్టరీ పాలసీ..
చైనా విషయంలో ట్రంప్ ఎలాంటి విధాన్ని తీసుకుంటారో చెప్పడం కష్టమని చాలా మంది విశ్లేషకులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ‘‘ నియంతృత్వ షీ జిన్ పింగ్ ను మెచ్చుకుంటారు. చైనాతో ఆర్థిక సంబంధాల విషయంలో కఠినంగా ఉంటానంటారు’’ అని ఆండ్రూ వాంగ్ అనే నిపుణుడు న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
చైనాపై ఒత్తిడి చేయడం ద్వారా అమెరికా వ్యాపార ప్రయోజనాలను విస్తరించాలని ట్రంప్ బిలియనీర్ సలహదారు ఎలాన్ మస్క్ వంటి వారు కోరుతుండగా, విదేశాంగమంత్రి అయినా మార్క్ రుబియో వంటి వారు చైనా తో ఎదురువుతున్న సవాళ్లను సైతం పరిగణలోకి తీసుకుని భద్రతా, ఆర్థిక రంగాలను పటిష్ట పరచాలని అనుకుంటున్నారు.
ట్రంప్.. షీ ఫ్రెండ్షిప్
ప్రమాణ స్వీకారం తరువాత విదేశాంగమంత్రి మార్క్ రూబియో క్వాడ్ విదేశాంగమంత్రులతో సమావేశం కాగా, చైనీస్ వైస్ ప్రెసిడెంట్ తో జేడీ వాన్స్ చర్చించారు. తరువాత ఆయన అమెరికా కార్పొరేట్ సీఈఓలతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో ఎలాన్ మస్క్ మాత్రమే చైనాపై ఎక్కువ సానుభూతిచూపుతున్నారు.
చైనా విదేశాంగమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. చైనా అధ్యక్షుడు- అమెరికా అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషనలు జరిగిన తరువాత హాన్ పర్యటన జరిగింది. ‘‘ మా ఇద్దరి మధ్య అనేక ప్రాముఖ్యతల మధ్య సమావేశాలు జరిగాయి. కొత్త అధ్యక్షుడి పాలనలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని చైనా వ్యాఖ్యానించింది.
క్వాడ్ భవిష్యత్ ఏంటీ?
నిజానికి క్వాడ్ అనేది 2007 లో సునామీ తరువాత ప్రారంభం అయింది. భవిష్యత్ లో సముద్ర సమాచారాన్ని పంచుకోవాలని అప్పట్లో ఆ దేశాలు నిర్ణయించుకున్నారు. అయితే ట్రంప్ పాలన కాలంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి దీన్ని భద్రతా రంగాలకు విస్తరించారు.
అందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లతో అమెరికా కూడి చైనా తో వ్యవహరించే విధానాన్ని పున: సమీక్షించుకున్నాయి. ముఖ్యంగా భారత్ కూడా చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుతో తన ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా 2020 లఢక్ లో గల్వాన్ ఘర్షణ తరువాత సంబంధాలు గట్టిగా బిగుసుపోయాయి. అయితే గత ఏడాది రెండు దేశాల మధ్య చర్చలు జరిగి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సద్దుమణిగింది.
భారత్ కు సవాళ్లు..
ప్రస్తుతం భారత్ - చైనా రెండు కూడా తమ సంబంధాలను సాధారణీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్ ఒకే సమయంలో యూఎస్, రష్యా, చైనాతో వ్యూహాత్మక సంబంధాలను నెరుపుతూ తన ప్రయోజనాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏదీ ఏమైన క్వాడ్ లో అది గట్టి సవాల్ల ను ఎదుర్కోబోతోంది.
అందులో ట్రంప్ పాలన కాలంలో భారత్ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ విధానాలను ఊహించడం కష్టం.. చిన్నవి పెద్దగా, పెద్దవి చిన్నగా మార్చడం ఆయనకిష్టం. మున్ముందు కాలంలో యూఎస్, చైనా తో ఎలా వ్యవహరించే విధానంలో సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో నిపుణులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Next Story