పాకిస్తాన్ కు మరోసారి ఆర్థిక కష్టాలు తప్పవా?
x
ఇస్లామిక్ ఉగ్రవాదులు

పాకిస్తాన్ కు మరోసారి ఆర్థిక కష్టాలు తప్పవా?

ఎఫ్ఏటీఎఫ్ కు కీలక ఆధారాలు అందించబోతున్న భారత్, గ్రే లిస్ట్ లోకి చేర్చే అవకాశం..


పాకిస్తాన్ ను మరోసారి ‘గ్రే’ లిస్టులో పెట్టించడానికి భారత్ సమాయత్తం అవుతోంది. ఉగ్రవాదులకు ఆయధాలు, డబ్బు ఇచ్చి మనమీదకి పంపుతున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదే జరిగితే పాకిస్తాన్ కు ప్రపంచంలో నిధులు సేకరించడం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే రుణాలు తీసుకోకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది.

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చి చంపడంతో రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రధాన కారణం పాకిస్తాన్ అని మనదేశం ఆరోపించింది.
ముఖ్యంగా ఇద్దరు ఉగ్రవాదులు ఇంతకుముందు పాక్ సైన్యంలోని స్పెషల్ ఫోర్స్ కు చెందిన వారని ఆధారాలు ప్రపంచం ముందు పెట్టింది. తరువాత మే 7 న ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన వందమందికి పైగా ఉగ్రవాదులు హతమార్చినప్పుడూ పాకిస్తాన్ సైనిక ప్రతినిధులు హజరవడం ప్రపంచం మొత్తం చూసింది. ఉగ్రవాదుల భౌతిక కాయాలపై ఏకంగా పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఫొటోలను భారత్ ప్రపంచం ముందు పెట్టింది.
ఎఫ్ఏటీఎఫ్ ఏం చేస్తుంది..
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రపంచ మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల నిఘా సంస్థ, చట్టవిరుద్ద కార్యకలాపాలను నిరోధించే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఇది ఏర్పాటు అయింది.
‘‘ఎఫ్ఏటీఎఫ్ యాంటీ మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ నిబంధనలకు సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న దుష్టపన్నాగాలపై భారత్ ఒక పత్రాన్ని సమర్పించబోతోంది. పాకిస్తాన్ గ్రే లిస్టింగ్ కోసం మేము ఎఫ్ఏటీఎఫ్ తో పరిశీలిస్తాము’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎఫ్ఏటీఎఫ్ ఆసియా పసిఫిక్ గ్రూప్(ఏపీజీ) తదుపరి సమావేశం ఆగష్టు 25న జరగబోతోంది. ఈ సమయంలో భారత్, తన దగ్గర ఉన్న ఆధారాలను ప్రపంచ వాచ్ డాగ్ కు అందించే అవకాశం ఉంది. తదుపరి ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ, వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్టోబర్ 20 న జరగబోతోంది.
ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టు లో 25 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు పర్యవేక్షణను పెంచుతున్నాయి. మనీలాండరింగ్, ఉగ్రవాద నిధులు, వ్యాప్తి నిధులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక లోపాలను పరిష్కరించాల్సి ఉంది.
ఇంతకుముందు మూడుసార్లు ‘గ్రే’ లిస్టులో..
పాకిస్తాన్ ను ఇంతకుముందు రెండుసార్లు ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పెట్టింది. 2008 లో ఫిబ్రవరిలో మొదటిసారి ఆ పర్యవేక్షణ జాబితాలో పెట్టారు. అయితే జూన్ 2010 లో దీనిని ఆ జాబితా నుంచి తొలగించారు.
కానీ ఫిబ్రవరి 2012 లో తిరిగి తీసుకొచ్చారు. తరువాత 2015 లో తొలగించారు. జూన్ 2018 లో మూడోసారి జాబితాలోకి తీసుకొచ్చారు. కానీ అక్టోబర్ 2022 లో తొలగించారు.
ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్ తన మనీలాండరింగ్ నిరోధక నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ఏపీజీతో కలిసి పనిచేయడం కొనసాగించాలని కోరింది.
ప్రపంచ బ్యాంకు నిధులను వ్యతిరేకించిన భారత్..
ప్రపంచ బ్యాంకు నుంచి పాకిస్తాన్ కు నిధులు విడుదల చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ విడుదల చేసే నిధులను ఇస్లామాబాద్ గతంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సేకరించడానికి అటువంటి నిధులను ఉపయోగించిందని వాదించింది. ఈ ఏడాది జనవరిలో అంగీకరించిన 20 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు వచ్చే నెలలో సమీక్షించే అవకాశం ఉంది.
2026 నుంచి ప్రారంభం అయ్యే పది సంవత్సరాల కాలానికి స్వచ్ఛమైన శక్తి, వాతావరణ స్థితిస్థాపకత వంటి రంగాలకు నగదు కొరతతో బాధపడుతున్న పాక్ కు నిధులు అందించారు.
‘‘పాకిస్తాన్ కు రాబోయే ప్రపంచ బ్యాంకు నిధులను మేము వ్యతిరేకిస్తాము’’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ కు 2.3 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించడానికి వ్యతిరేకిస్తూ భారత్ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిలినా జార్జివా, ఐఎంఎఫ్ బోర్డు సభ్యదేశాల మంత్రులతో లాబీయింగ్ చేసింది.
ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారుల హాజరుకావడం నుంచి ఇస్లామాబాద్ గత రెండు దశాబ్ధాలుగా నిధులను దుర్వినియోగం చేసిందని, ఆయుధాల సేకరణ విపరీతంగా పెరిగిందని చూపించే కీలక ఆధారాలను న్యూఢిల్లీ సమర్పించింది.
‘‘అభివృద్ది ప్రయోజనాల కోసం ఏ దేశము డబ్బు తీసుకోవడానికి భారత్ వ్యతిరేకం కాదు. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు, యుద్ద పరిస్థితులు ఉన్న సమయంలో ఐఎంఎఫ్ చేసింది సరైన పనికాదు. అలాగే పాకిస్తాన్ ప్రజల కోసం కాకుండా ఆయుధాల కొనుగోలు కోసం ఖర్చు చేసే చరిత్రను కలిగి ఉంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
పబ్లిసిటీ డేటా ప్రకారం పాకిస్తాన్ తన సాధారణ బడ్జెట్ లో సగటున 18 శాతం రక్షణ వ్యవహరాలు, సేవల కోసం ఖర్చు చేస్తోంది. అయితే సంఘర్షణ ప్రభావిత దేశాల దేశాలు కూడా సగటున చాలా తక్కువ ఖర్చు చేస్తాయి. ఇంకా 1980 నుంచి 2023 వరకూ పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు ఐఎంఎఫ్ నిధులు అందుకున్న సంవత్సరాలలో సగటున 20 శాతానికి పైగా పెరిగాయి.
Read More
Next Story