
తమిళనాడుకు వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించడం సాధ్యం కాదా?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎ కలైయరసన్, ది ఫెడరల్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్ ను శాసనసభకు సమర్పించారు.
ఈ నేపథ్యంలో ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్ శ్రీనివాసన్, మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్ లో ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఎ కలైయరసన్ బడ్జెట్ ను, తమిళనాడు ఆర్థిక పరిస్థితిని విశ్లేషించే ప్రయత్నం చేశారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే పూర్తి స్థాయి, చివరి బడ్జెట్ ఇదే.
ఆశయం కొండంత.. లక్ష్యం..
వచ్చే ఐదేళ్లలో అంటే 2030 నాటికి తమిళనాడును వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యం అనేక సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది.
ఈ ఆర్ధిక ఆకాంక్షలు రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి బాగుంటాయి కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలను ప్రతిబింబించవని కలైయరసన్ చెప్పారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరుగును చూస్తే.. ఇదే వేగంతో ప్రయాణం చేస్తేనే కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుంది.’’ అని ఆర్థికవేత్త విశ్లేషించారు.
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్డీపీ) 310 బిలియన్ డాలర్ల ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరాలంటే దీన్ని మూడురేట్లకు పెంచుకోవాలి.
ఇది ఐదు సంవత్సరాలలో చేరుకోవాలంటే కనీసం 26 శాతం వృద్దిరేటు సాధించాలి. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధిరేటు 8 శాతం మాత్రమే ఉంది.’’ అని ఆయన అన్నారు. వృద్దిని సాధించడమే కాదు, అటువంటి విస్తరణ స్థిరంగా, సమ్మిళితంగా ఉండేలా చూసుకోవాలి.
తయారీ రంగం వర్సెస్ ఉపాధి సవాళ్లు...
తమిళనాడు చాలాకాలంగా తయారీ రంగానికి కేంద్రంగా ఉంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉన్నత స్థాయి పరిశ్రమలను కార్మిక శక్తి ఆధారంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలతో సమతుల్యం చేస్తుంది.
అయితే ఆటోమేషిన్, ఏఐ రాక పెరిగే కొద్ది, తయారీరంగం తక్కువ ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఇది ఉపాధి పై కొత్త ఆందోళనలను పెంచుతుంది. ఇవి నిజంగా ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతున్నాయి.
తమిళనాడు అధిక స్థూల నమోదు నిష్పత్తి 47 ఉన్నప్పటికీ, చాలామంది గ్రాడ్యుయేట్లకు తగిన ఉపాధి అవకాశాలు మాత్రం అందడం లేదు. ‘‘చదివిన చదువును, పరిశ్రమలకు అవసరమైన శ్రామిక నైపుణ్యంతో అనుసంధానం చేయడమే అసలుసిసలు సవాల్’’ అని కలైయరసన్ వివరించారు.
దేశంలో మహిళా శ్రామిక శక్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని ‘దిఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ అన్నారు. అయితే తయారీ రంగ వృద్దిని ఉపాధి అవకాశాలుగా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మున్ముందు సవాల్ గా మారనుందని అంచనా వేశారు.
‘‘ఆపిల్, ఫాక్స్ కాన్ వంటి ప్రధాన ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను రాష్ట్రం దిగ్విజయంగా ఆకర్షించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన పరీక్ష ఏంటంటే.. మరిన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఈ సరఫరా గొలుసులో సూక్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలను అనుసంధానించడమే’’ అని ఆయన అన్నారు.
తగ్గుతున్న వ్యవసాయారంగం పాత్ర
తమిళనాడు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అందించే వాటా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఇది స్థూల రాష్ట్ర విలువ ఆధారిత లో కేవలం 6-10 మాత్రమే అయినప్పటికీ రాష్ట్రం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రభావితం చేస్తూనే ఉంది.
వ్యవసాయం ఆర్థికంగా చిన్నగానే కనిపిస్తున్నప్పటికీ, అది గణనీయమైన సాంస్కృతిక, రాజకీయ నేపథ్యాన్ని కలిగి ఉందని శ్రీనివాసన్ వివరించారు.
‘‘తమిళనాడు గుర్తింపులోనే వ్యవసాయం ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద పండగ పొంగల్. ఇది వ్యవసాయ పండగనే. చాలామంది ప్రజలు పట్టణాలకు వలస వస్తున్నప్పటికీ, వారి మూలాలు ఇంకా గ్రామాల్లోనే ఉన్నాయి. వారికి పల్లెలతో బలమైన సంబంధాలు ఉన్నాయి’’ అని ఎడిటర్ అన్నారు.
అయితే కొన్నాళ్లుగా వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తరుచుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ దిగుబడిని తగ్గడానికి కారణమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా అని కలైయరసన్ అన్నారు.
ఈ ప్రమాదాలను తగ్గించడానికి వాతావరణ నిరోధక విత్తనాలు, పంటకోత తరువాత మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టే ప్రాముఖ్యతను ఆయన ఎత్తి చూపారు.
‘‘వ్యవసాయంలో ఆదాయం తగ్గుతుందని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు రాకుండా వ్యవసాయం నుంచి బయటకు వెళ్లేలా తయారీ, సేవలలో ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలను మనం నిర్ధారించుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక మార్పును తీసుకురావడానికి తమిళనాడు ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి విధానాలను కీలకంగా మారబోతున్నాయి.
ఆంగ్ల భాషా ప్రావీణ్యం..
జాతీయ విద్యావిధానం, త్రిభాషా సూత్రం పై తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్రం హిందీ విధించడాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తోంది. ఈ చర్చ ఎక్కువగా రాజకీయపరమైనది అయినప్పటికీ తమిళనాడు ఇంగ్లీష్ పై ముఖ్యంగా ఐటీ ప్రపంచ వ్యాపార రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందిందని కలైయరసన్ పేర్కొన్నారు.
‘‘అనేక భాషలు నేర్చుకోవడం కచ్చితంగా ప్రయోజనమే కావచ్చు కానీ.. తమిళనాడు నిజమైన ఆర్థిక చోదకశక్తి ఆంగ్ల ప్రావీణ్యం, ఇది రాష్ట్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు మంచి స్థానంలో నిలిపింది’’ అని ఆయన అన్నారు. భాషా విధానాలు తరుచుగా రాజకీయ వివాదాలకు కారణమవుతున్నాయని ఎస్. శ్రీనివాసన్ అన్నారు.
తమిళనాడు వాటా తగ్గుతోంది..
కేంద్ర నిధులలో వాటా తగ్గడంపై తమిళనాడు ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఇటీవల తమిళనాడు పన్నులలో గణనీయంగా వాటా ఇస్తున్నప్పటికీ, యూపీ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రానికి తక్కువ వాటా పొందుతోందన్నారు.
కేంద్రం తమిళనాడుకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 45 వేలుగా ఉన్నాయని, ఇది రాష్ట్ర ఆర్థిక లోటులో 44 శాతానికి సమానమని ఎస్. శ్రీనివాసన్ చెప్పారు.
అంతేకాకుండా తమిళనాడు తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రెండింతలు ఉన్నప్పటికీ కేంద్ర కేటాయింపులు అధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఆర్థిక అసమతుల్యత రాష్ట్రం, కేంద్రం మధ్య ప్రధాన వివాదంగా ఉంది.
Next Story