
పశ్చిమ బెంగాల్‌లో గ్యాస్ కొరత
మెనూ తగ్గించిన హోటళ్లు.. నిలిచిపోయిన LPG ఆటోలు..
పశ్చిమ బెంగాల్ వంట గ్యాస్ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్ ఆధారంగా నడిచే ఆటోలు నిలిచిపోయాయి. కొన్ని హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. మరికొన్నింటిలో మెనూ తగ్గించారు. ఇటు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులుతీరి కనిపించారు.
వంట గ్యాస్ ఇబ్బందులకు తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేసింది. అలాగే గ్యాస్ సరఫరా నిరంతర పర్యవేక్షణకు ‘నబన్నా’ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ పాయింట్‌ను ఏర్పాటుచేసింది. కొలకతా పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నగరంలోని గ్యాస్ పంపిణీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. సిలిండర్ల అక్రమ మళ్లింపులపై చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్‌తో నడిచే ఆటోరిక్షాలు తగ్గడంతో కొన్ని మార్గాల్లో డ్రైవర్లు సాధారణ ఛార్జీల కంటే 10–25 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయి.

