ఐపీఎల్: తనంత తానుగా తప్పుకోనున్నాడా? తప్పిస్తారా
x

ఐపీఎల్: తనంత తానుగా తప్పుకోనున్నాడా? తప్పిస్తారా

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా కేఎల్ రాహూల్ ను యాజమాన్యం తప్పించబోతుందా? లేకపోతే రాహూల్ తనంత తానుగా తప్పుకోనున్నారా అనే వార్తలు..


లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా కేఎల్ రాహూల్ తప్పుకోనున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్ కు లక్నో సాంకేతికంగా ఇంకా పోటీలోనే ఉంది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది.

బుధవారం హైదరాబాద్ తో మ్యాచ్ ఓడిన అనంతరం లక్నో జట్టు యజమాని రాహూల్ ను పబ్లిక్ గా మందలించడం పై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అభిమానులు, క్రీడా పండితులు రాహూల్ కు అండగా నిలబడ్డారు. అయితే రాహూల్ తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా, ఆటగాడిగా అందుబాటులో ఉంటాడా అనే విషయంలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

2022లో ఐపీఎల్ వేలంలో రాహూల్ రికార్డు స్థాయిలో రూ. 17 కోట్లకు అమ్ముడయ్యాడు. అయితే 2025 వేలంలో తిరిగి మెగావేలంలో రాహూల్ ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహగానాలు వస్తున్నాయి. అసలు వచ్చే రెండు మ్యాచ్ లకు కూడా కేఎల్ కెప్టెన్ గా ఉండటానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు.

తను తదుపరి గేమ్ లలో బ్యాటింగ్ ను మెరుగు పరచుకోవడానికి ఎక్కువ దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని విడిచి పెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ‘‘ డీసీతో మరో మ్యాచ్ కు ఇంకో ఐదు రోజుల గ్యాప్ ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన మ్యాచ్ ల కోసం రాహూల్ బ్యాటింగ్ కోసం తన గేమ్ పై దృష్టి సారించాలని ప్లాన్ చేసిన. జట్టు మేనేజ్ మెంట్ పట్టించుకోదని అర్ధమైంది’’ అని జట్టు పరిస్థితులపై జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది.

వివాదం ఏంటంటే..
ఐపీఎల్ లో బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరే పది ఓవర్ల లోనే చేజింగ్ చేశారు. అంతకుముందు ఇదే పిచ్ పై బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటింగ్ లో తీవ్రంగా తడబడింది.
కెప్టెన్ కేఎల్ రాహూల్, కృనాల్ పాండ్యా చాలా నిదానంగా ఇన్నింగ్స్ ను నిర్మించారు. తరువాత ఇదే పిచ్ పై హైదరాబాద్ ఒపెనర్లు చెలరేగి ఆడారు. మ్యాచ్ అనంతరం లక్నో జట్టు యజమాని కెప్టెన్ కేఎల్ రాహూల్ పై తీవ్రంగా మండిపడుతున్నట్లు ఉన్న వీడియోను అధికారిక బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా డిమాండ్ చేశారు.
రాహూల్ ప్రదర్శన ఎలా ..
హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో బ్యాటింగ్ కు వచ్చిన రాహూల్ 33 బంతులను ఎదుర్కొని 29 పరుగులు మాత్రమే సాధించాడు. ఇప్పటి దాకా 12 మ్యాచ్ లు ఆడిన కేఎల్.. 460 పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో 500 పరుగుల మార్క్ ను సాధించగలడు. అయితే ఇక్కడ అతని స్ట్రైక్ రేట్ 136.09 మాత్రమే. దీనితో ఓనర్ గోయోంకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
లక్నో జెయింట్ మిగిలిన రెండు మ్యాచ్ లను మే 14న ఢిల్లీ క్యాపిటల్స్, మే 17 వాంఖడే వేదికగా ముంబైతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లను గెలవడం ద్వారా 16 పాయింట్లు సాధించగలదు. కానీ నెట్ రన్ రేట్ పరంగా జట్టు చాలా వెనకబడి ఉంది. ఒకవేళ కెప్టెన్ గా రాహుల్ వైదోలగాలని భావిస్తే, తదుపరి నికోలస్ పూరన్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.


Read More
Next Story