మోదీ పర్యటన ఉక్రెయిన్ లో శాంతికి నాంది పలుకుతుందా?
x

మోదీ పర్యటన ఉక్రెయిన్ లో శాంతికి నాంది పలుకుతుందా?

ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటనను ఉక్రెయిన్ తో సహ పశ్చిమ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో పుతిన్ పై మోదీకి ..


భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటన చేస్తున్నారు. మొదట యూరప్ లోని పోలండ్ ను తరువాత అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన కీవ్ లో శాంతి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తుందని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. శాంతియుత పరిష్కారానికి మద్దతివ్వడానికి భారత్ తన శక్తి మేరకు అన్ని విధాలా ప్రయత్నిస్తుందని మోదీ చెప్పారు.

1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక భారత ప్రధాని కీవ్ లో జరుపుతున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. జూలై 2024లో ఇటలీలో జరిగే G7 సమ్మిట్ సందర్భంగా మోదీ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిసిన తర్వాత కీవ్ పర్యటన ఖరారు చేయబడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీని హత్తుకుని తన దేశంలో పర్యటించాల్సిగా అప్పుడు కోరాడు.
ఉక్రెయిన్ బహుశా భారతదేశం మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరుకుంటుంది. ఏ పాశ్చాత్య దేశంతో పోలిస్తే మాస్కోపై న్యూ ఢిల్లీకే ఎక్కువ పరపతి ఉందని విశ్వసిస్తోంది. మార్చి 2024లో, భారత్- ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అంగీకరించాయి.
స్విట్జర్లాండ్‌లో జరిగే ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాలని మోదీతో ఫోన్‌లో జెలెన్స్కీ భారత్‌ను ఆహ్వనించారు. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. అయితే మోదీ స్విస్ లో జరిగే సమ్మిట్‌కు హాజరు కాలేదు. సమ్మిట్ నుంచి వెలువడిన సంయుక్త ప్రకటనను భారతదేశం ఆమోదించలేదు
శాంతి స్థాపకుడా?
అయితే, వ్యూహాత్మక నిపుణులు భారత్ "శాంతికర్త"గా మారడానికి ఆసక్తిగా ఉందని భావిస్తున్నారు. పశ్చిమ దేశాలు భారత్ లేదా మోదీ మధ్యవర్తిగా వ్యవహరించి, 28 నెలలుగా కొనసాగుతున్న యుద్దానికి ముగింపు తీసుకురాగలడని విశ్వసిస్తున్నాయి. పుతిన్ పై మోదీ ప్రభావం గణనీయంగా ఉందని అవి బలంగా నమ్ముతున్నాయి.
న్యూఢిల్లీ శాంతికి పరిమిత సహకారం అందించగలిగినప్పటికీ, అది ఒక ప్రధాన మైలురాయి అవుతుంది. ఇది నిజంగా జరిగితే ప్రజల శక్తిగా భారత్ హోదా పెరిగినట్లు అవుతుంది. ఇదే మోదీ వాంఛ.
మాస్కో, ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భూభాగాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు - డోనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియాలో రష్యా సైన్యం ఉంది. ఈ ప్రాంతాలను అధికారికంగా రష్య తనలో కలుపుకుంది. దీనితో పాటు ఉక్రెయిన్ తన భూభాగంలో ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలి వేయాలని డిమాండ్ చేస్తుంది. కానీ వీటిని కీవ్ ఒప్పుకోదు.
రాజీ లేదు
కీవ్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడాలని కోరుకోవడం లేదు. అది ఉక్రెయిన్‌లో మరింత అస్థిరతను తీసుకొచ్చే విప్లవానికి దారితీయవచ్చు. క్రిమియాతో సహా రష్యా ఆక్రమించిన మొత్తం ఉక్రేనియన్ భూభాగాన్ని తిరిగి పొందాలని కూడా కీవ్ కోరుకుంటోంది. రష్యా తన దళాలను ఉక్రెయిన్ భూభాగం నుంచి వెనక్కి తీసుకోవాలని దాని కోరిక, కానీ క్రిమ్లిన్ ఈ పనికి ఒప్పుకోదు.
యుఎస్- నాటో కూడా యుద్ధాన్ని ముగించాలన్న రష్యా డిమాండ్లను తిరస్కరించాయి. ఇరుపక్షాలు తమ విభేదాలను సరిదిద్దుకోవడం అసంభవంగా కనిపిస్తోంది. అందువల్ల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఇరువైపులా అలసిపోయినా అవి తమ జాతి గౌరవార్థం యుద్దాన్ని కొనసాగించాలని వాంఛిస్తున్నాయి.
యుద్ధాన్ని విరమించడానికి భారత్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. పుతిన్, జెలెన్స్కీతో మోదీ అనేకసార్లు ఫోన్ కాల్స్, ప్రత్యక్షంగా మాట్లాడి యుద్దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ ఇప్పటి వరకూ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది.
'చర్చలు - దౌత్యం'( డైలాగ్ అండ్ డిప్లమసి)
అంతర్జాతీయ వేదికలపై మోదీ తన మనసులో మాటను బహిరంగంగా ప్రకటించారు. ఇది యుద్దకాలం కాదని( దిస్ ఈజ్ నాట్ ఏ వార్ ఎరా) అని పుతిన్ ముందే ప్రకటించారు. కేవలం చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, యుద్ద భూమిలో కాదని కుండబద్దలు కొట్టారు.
అయితే భారత్ తన తటస్థ వ్యూహంలో భాగంగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను బహిరంగంగా విమర్శించలేదు. అంతేకాకుండా రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలో ప్రవేశ పెట్టిన ఏ తీర్మానాన్ని కూడా న్యూఢిల్లీ ఆమోదించలేదు.
అయితే, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ పట్ల గౌరవాన్ని నిరంతరం హైలైట్ చేస్తూ న్యూఢిల్లీ రష్యాను పరోక్షంగా విమర్శించింది. 2022- 2023లో భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ రష్యాకు వెళ్లడం మానుకున్నారు.
అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు భారత్ తటస్థ వైఖరిని విమర్శిస్తున్నాయి. రష్యాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా (నాటో శిఖరాగ్ర సమావేశంతో సమానంగా) పుతిన్‌ను మోదీ కౌగిలించుకున్నందుకు అమెరికా, ఉక్రెయిన్‌లు మోడీని తీవ్రంగా విమర్శించాయి.
అదే రోజు, కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఇందులో పిల్లలతో సహ అనేకమంది పౌరులు మరణించారు. ఇది పరోక్షంగా పుతిన్ ను ఇండియా మందలించవలసి వచ్చింది.
చైనా పాత్ర
ఏది ఏమైనప్పటికీ, US నేతృత్వంలోని పశ్చిమ దేశాలు చైనాను మధ్యవర్తిగా కాకుండా భారత్ (రష్యా - US రెండింటితో బలమైన సంబంధాలను కలిగి ఉంది) ఆ పాత్ర పోషించడాన్ని బలంగా నమ్ముతున్నాయి.
యుద్ధంలో తటస్థంగా వ్యవహరించిన చైనా వలె కాకుండా, రష్యా యుద్ధ ప్రయత్నాలకు భారత్ ఎటువంటి భౌతిక మద్దతును అందించలేదు. US నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధ్వర్యంలోని NATO తూర్పువైపు విస్తరణను చైనా బహిరంగంగా విమర్శించింది.
అంతేకాకుండా, ఫిబ్రవరి 2023లో చైనా రూపొందించిన శాంతి ప్రతిపాదన మాస్కోకు అనుకూలంగా ఉందని, బీజింగ్ ప్రణాళిక పట్ల పశ్చిమ దేశాలు తమ నిరాశను వ్యక్తం చేశాయి.
అయితే, మోదీతో శాంతి ప్రణాళిక ఉండే అవకాశం లేదు. మాస్కో - కీవ్‌లు యుద్ధాన్ని ముగించడానికి చర్చల పట్టికలో కూర్చోవడానికి ఇంకా ఇష్టపడలేదని మోదీకి బాగా తెలుసు.


Read More
Next Story