నేవీ అమ్ములపొదిలోకి ‘సోనోబాయి’, ఆమోదం తెలిసిన అమెరికా కాంగ్రెస్
x

నేవీ అమ్ములపొదిలోకి ‘సోనోబాయి’, ఆమోదం తెలిసిన అమెరికా కాంగ్రెస్

న్యూఢిల్లీ ఓ వైపు ఆత్మనిర్భర భారత్ అంటూనే మరోవైపు కొన్ని కీలక ఆయుధ వ్యవస్థలను అగ్రరాజ్యాల నుంచి కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా యూఎస్ఏ నుంచి ..


భారత్ - యూఎస్ఏ మధ్య మరో భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే చినూక్, అపాచీ, కీలకమైన డ్రోన్లు, ఫైటర్ జెట్ ఇంజిన్లు ఇండియాకు విక్రయిస్తున్న యూఎస్ తాజాగా హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (HAASW) సోనోబోయ్‌లను కూడా అందిచడానికి నిర్ణయించింది. ఇది జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలను నిర్వహించి న్యూ ఢిల్లీ సామర్థ్యాన్ని పెంచుతుంది. వీటి విలువలో (USD) 52.8 మిలియన్లని అంచన.

సోనోబాయిస్ అంటే ఏమిటి?
Sonobooys అనేది గాలిలో లాంచ్ చేయబడి, నీటి అడుగున శబ్దాలను గ్రహించి రిమోట్ ప్రాసెసర్‌లకు అందించడానికి రూపొందించిన ఎలక్ట్రో-మెకానికల్ సెన్సార్లు. ఇవి ప్రభావవంతమైన యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ASW) సాధనాలు. ఇవి గాలిలో ప్రయాణించే ASW ఫైటర్‌లు ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇవి సాధారణంగా 24 గంటలపాటు చురుకుగా ఉంటాయి. శత్రు జలాంతర్గాములు, నౌకలను గుర్తించడం, వర్గీకరించడం, నిఘా వేయడంలో ఉపయోగపడతాయి. హై-ఆల్టిట్యూడ్ యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (HAASW) sonobooys అధిక ఎత్తుల నుంచి జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వీటిని 30,000 అడుగుల ఎత్తులో ఎగిరే విమానాలకు బిగించిన సమర్థవంతంగా పని చేస్తాయి.
Sonobooyలు నీటి అడుగున శబ్దాలను గుర్తించగల అధునాతన పరికరాలను కలిగి ఉన్నాయి. అవి జలాంతర్గాముల కదలికను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడతాయి. అవి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధాన్ని నివారించడానికి ప్రభావవంతంగా ఉంటాయి. గాలిలో ప్రయోగించిన టార్పెడోలతో కచ్చితమైన దాడులను నిర్వహించడానికి నౌకాదళానికి సహాయపడతాయి.
వీటితో అదనపు ప్రయోజనం ఏమిటంటే వాటిని విమానం లేదా జలాంతర్గాములు లేదా నౌకల్లో మోహరించడం సులువు. జలాంతర్గామి దాడుల నుంచి క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను రక్షించడం, దేశం నౌకాదళ భద్రతను మెరుగుపరచడంలో అవి కీలకమైనవిగా గుర్తించబడ్డాయి.
ఇవి ఎందుకు ముఖ్యమైనవి..
" MH-60R హెలికాప్టర్ల నుంచి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వీటి ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పరికరాన్ని తన సాయుధ దళాలలోకి చేర్చుకోవడంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో భాగమైన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) ఈ వారం సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీకి ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో చైనా జలాంతర్గాముల ఉనికి కారణంగా భారత్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ASW) సామర్థ్యాలు అదనపు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అధునాతన ఆయుధ వ్యవస్థలు, డిటెక్షన్ సిస్టమ్‌లు, సెన్సార్‌లను కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా దాని ASW సామర్థ్యాలను క్రమంగా మెరుగుపరుచుకుంటోంది.
ఒప్పందంలో ఏ పరికరాలు భాగం?
అమెరికా కాంగ్రెస్ నోటిఫికేషన్ ప్రకారం, భారతదేశం AN/SSQ-53O హై ఆల్టిట్యూడ్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (HAASW) సోనోబాయిలను కొనుగోలు చేయాలని అభ్యర్థించింది. AN/ SSQ-62F HAASW sonobuoys, AN/SSQ-36 sonobooys ఉండబోతున్నాయి.
ప్రక్రియలో తదుపరి దశ ఏమిటి?
ఆగస్టు 23న, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, USD 52.8 మిలియన్ల అంచనా వ్యయంతో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ Sonobooys, సంబంధిత పరికరాలను భారతదేశానికి విదేశీ సైనిక విక్రయానికి ఆమోదించారు. అమ్మకం గురించి పెంటగాన్ US కాంగ్రెస్‌కు తెలియజేసింది. కాంగ్రెస్ దీనిని తరువాత ఆమోదించింది.
"ఈ ప్రతిపాదిత విక్రయం యునైటెడ్ స్టేట్స్-భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడంతో పాటు రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో ఆర్థిక పురోగతి సాధిస్తుంది ” అని నోటిఫికేషన్ పేర్కొంది. ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టం ప్రకారం, కాంగ్రెస్ విక్రయాన్ని సమీక్షించడానికి 30 తుది కాలం ఉంటుంది.


Read More
Next Story