భారత్- నేపాల్ సంబంధాలకు ‘ ఓలీ’ గండం
x

భారత్- నేపాల్ సంబంధాలకు ‘ ఓలీ’ గండం

నేపాల్ లో మారిన రాజకీయాలు భారత్ ను మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకుంటే నేపాల్ కొత్త ప్రధానిగా భారత వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేపీశర్మ ఓలీ..


(పరుల్ చంద్ర)

నేపాల్ లో రాజరికం పోయి.. మేడిపండు ప్రజాస్వామ్యం మొదలయ్యక భారత్- నేపాల్ మధ్య వివాదాలు నిత్యకృత్యం అయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు గిల్లి మరీ వివాదాలు రాజేయడంలో ముందున్నారు. తాజాగా నేపాల్ మొన్నటి వరకూ అధికారంలో ఉన్న ప్రచండ అలియాస్ పుష్ప కమాల్ దహల్ ను అక్కడి పార్టీలు పీఠం నుంచి దింపేశాయి. ఆయన స్థానంలో భారత వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేపీ శర్మ ఓలీ నాలుగో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో భారత్- నేపాల్ మధ్య సంబంధాలు మరోసారి గందరగోళంలో పడవచ్చు.

సంకీర్ణ భాగస్వామి నేపాలీ కాంగ్రెస్‌తో పాటు దిగువ సభలో అతని పార్టీ CPN-UMLకు ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే నేపాల్ పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీతో అతను విశ్వాస పరీక్షలో నెగ్గడం ఖాయం. తన కుటిల రాజకీయాలతో ఇప్పటికే న్యూ ఢిల్లితో సంబంధాలను క్లిష్టం చేసుకుంటున్న ఆయన మరోసారి పీఠం ఎక్కడం విదేశీ వ్యవహారాల్లో మరో కుస్తీ పట్లు తప్పకపోవచ్చు.
నేపాల్ లో భారత్ పట్టు తిరుగులేనన్నీ రోజుల నుంచి ఇప్పుడు నూలు పోగు దారం స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం ఖాట్మండ్ పూర్తిగా బీజింగ్ నియంత్రణలో ఉంది. ఓలీ పూర్తిగా చైనా బంటుగా ఉంటారని ఇంతకుముందే రుజువయ్యింది. మౌలిక సదుపాయాల పేరిట చిన్న దేశాల్లో భారీగా నిధుల వరద పారిస్తున్న చైనా.. ఆయా దేశాలను పూర్తిగా గుప్పిట పడుతోంది. అందులో నేపాల్ కూడా ఒకటి.
నేపాల్‌ను ఆకర్షిస్తున్న చైనా..
నేపాల్ లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా చైనా ఆధీనంలోనే ఉన్నాయి. నిజానికి చైనా ఏ దేశంలో నైనా ఒక పార్టీని తన వైపుకు తిప్పుకుంటుంది. కానీ ఇందుకు విరుద్దంగా నేపాల్ లోని అన్ని రాజకీయ పార్టీలు బీజింగ్ తన వైపుకు తిప్పుకుంది. భారత్ కు ఇబ్బంది కలిగించే విధంగా వన్ బెల్ట్ వన్ రోడ్ లో నేపాల్ ను చేర్చుకోగలిగింది. కానీ చైనా చేపట్టిన అన్ని ప్రాజెక్ట్ లు ఇక్కడ విఫలం అయ్యాయి. అయినా చైనా మాత్రం తన పట్టును విడవడం లేదు. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లోనూ బీజింగ్ ఇదే తరహ కుటిల ప్రయత్నాలను చేస్తోంది. తన విస్తరణ వాదాన్ని నిరంతరం విస్తరించుకుంటూ వస్తూనే ఉంది.
ఓలీ ప్రధానమంత్రిగా బీజింగ్ వైపు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. ఖాట్మండుతో తన సంబంధాల భవిష్యత్తు పథం గురించి న్యూఢిల్లీ అర్థం చేసుకోవచ్చు. చైనాతో సహకరిస్తూ, భారతదేశ వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించడానికి నేపాలీ జాతీయవాదాన్ని ఉపయోగించిన వాడు ఓలీ.. ఆయన కాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
భారత వ్యతిరేక విధానాన్ని అనుసరించడం ద్వారా నేపాల్ ఆర్థికంగా పురోగతి సాధించలేమని ఆయన పార్టీ నాయకులు ఇటీవలి రోజుల్లో ఒప్పుకున్నారు. ఓలీ ఆధ్వర్యంలో ఆటుపోట్లు ఎప్పుడైనా ఎదురుకావచ్చని న్యూఢిల్లీకి కూడా బాగా తెలుసు. ఇప్పుడు సింఘా దర్బార్‌లో హాయిగా ఉన్న పీఎం ఓలీ ఆయన పార్టీ నాయకులు ప్రకటించిన విధంగా భారతదేశ అనుకూల ప్రకటనలకు కట్టుబడి ఉంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే, తన రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రాత్మకంగా సన్నిహితమైన పొరుగు దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రధానిగా ఆయన గత చర్యలు రుజువు చేశాయి.
దేవుబా మాత్రమే ఓదార్పు
సాంప్రదాయకంగా భారతదేశానికి అనుకూలమైన షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వంలో భాగం కావడం మాత్రమే న్యూఢిల్లీకి ఓదార్పు.
తమ పేద దేశం అభివృద్ధి కోసం పని చేయడానికి ఓలి-డియుబా సంకీర్ణం ముందు ఒక భారీ అవకాశం ఉంది. తాము కుదుర్చుకున్న ఏడు అంశాల అధికార భాగస్వామ్య ఒప్పందంలో సుపరిపాలన, ఆర్థిక ప్రగతి, రాజకీయ స్థిరత్వం, రాజ్యాంగ సవరణలకు హామీ ఇచ్చారు. అయితే, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలు, నేపాల్ లోని కొన్ని వర్గాలు బెదిరిస్తున్నాయి. ఇది 2015లో కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించి, దేశాన్ని చక్రవర్తి నుంచి సమాఖ్య ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా మార్చడానికి అనుమతించింది.
ఒప్పందం ప్రకారం, ఓలి, దేవుబా ప్రధానమంత్రి పదవిని పంచుకుంటారు. ఒలీ మొదటి రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు, ఆ తర్వాత 2027 చివరిలో జరిగే ఎన్నికల వరకు దేవుబా నాయకత్వం వహిస్తారు. అయితే, నేపాల్‌లో రాజకీయాలు ఎప్పుడూ సంక్షిష్టంగా ఉంటాయి.
ఇప్పుడు ఉన్న రాజకీయ దృశ్యాన్ని బట్టి చూస్తే, సీనియర్ పార్టీ నాయకులు పూర్తిగా అవకాశవాదంతో, ప్రధానమంత్రి కుర్చీని కైవసం చేసుకోవాలనే కోరికతో నడిపిస్తారు. పొత్తు కొనసాగుతుందా అన్నదే ప్రశ్న.
ఓలి తన మాట నిలబెట్టుకుంటాడా?
దేవుబా.. తరువాత ప్రధానమంత్రి అవుతానని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ, ఓలీ తన గత ట్రాక్ రికార్డ్‌ను బట్టి ఆ పదవిని చేపట్టడానికి దేవుబాకు అవకాశం ఇస్తాడా లేదా అన్న సందేహం ఇప్పటికి ఉంది. తనతో అధికారం పంచుకుంటానని ఇంతకుముందే ప్రచండకు ఆయన హమీ ఇచ్చినప్పటికీ చివరకు పీఠం ఇవ్వడానికి నిరాకరించారు.
కాబట్టి ఓలితో సంబంధం నెరపడంలో ఆయన న్యూఢిల్లి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఆయన ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దులోని కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాపై అనవసర వివాదాలు సృష్టించాడు.
జాగ్రత్తగా నడవాల్సిన సమయం
ఈ వివాదాన్ని చర్చించడానికి విదేశాంగ కార్యదర్శి స్థాయి సమావేశానికి ఖాట్మండు చేసిన అభ్యర్థనకు న్యూఢిల్లీ తిరస్కరించింది. దీంతో ఆయన మే 2020లో తన దేశం మ్యాపును మళ్లీ రూపొందించడానికి పూనుకున్నారు. నేపాల్‌కు వస్తువుల తరలింపుపై భారత్ విధించిన అనధికారిక దిగ్బంధనాన్ని సెంటిమెంట్‌లను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకున్నవాడు ఒలీ.
ఈ దిగ్బంధనం, సాధారణ నేపాల్‌కు చాలా కష్టాలను కలిగించింది, ఒలి తన భూపరివేష్టిత దేశానికి ప్రత్యామ్నాయ వాణిజ్యం- రవాణా మార్గాల కోసం చైనా వైపు మొగ్గు చూపేలా చేసింది. నేపాల్ పూర్తిగా చైనా వైపు వెళ్లకుండా భారత్ వేగంగా పావులు కదపాలి. బీజింగ్ చేస్తున్న దుందుడుకు చర్యలకు కళ్లెం వేయాలి.
Read More
Next Story