
గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి విజ్ఞానం
సీఎం చంద్రబాబు-కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఒప్పందం.
ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయాలంటే ప్రతి ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ ముఖ్యమని సీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏపీలో ఏబీఎన్‌పీ అమలుకు రూ.2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఏబీఎన్‌పీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం SPV ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నిధి-ఏపీ ప్రభుత్వం మధ్య MoC కుదుర్చుకున్నారు. డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు MoCపై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా సహకార ఒప్పందం చేసుకున్నారు.
త్వరిగతిన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, క్షేత్ర స్థాయి సమన్వయానికి పూర్తి సహకారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 1,692 ఫేజ్-I పంచాయతీల్లోని నెట్ వర్క్ అప్ గ్రేడ్ చేయడం, 11,254 ఫేజ్-IIలోని గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం... ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం వంటి వాటిపై ఈ ఏబీఎన్‌పీ ప్రాజెక్టుతో పని చేయనుంది. 3,942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది.
ఈ సహకార ఒప్పందం కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాండ్ విడ్త్ పెంచమని బీఎస్ఎన్ఎల్‌ను అడిగాను. పెంచిన బ్యాండ్ విడ్త్‌తో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సులు పెట్టేవాడిని. టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావాలని నాటి ప్రధాని వాజ్ పేయిని కోరాను. అప్పట్లో జాతీయ స్థాయిలో కమిటీ వేస్తే టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టాలని నివేదిక ఇచ్చాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా డి-రెగ్యులేషన్ అమల్లోకి వచ్చింది. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి, డిజిటల్ కనెక్టివిటీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చక్కగా పని చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి అన్నారు.
చక్కటి వ్యవస్థను నాశనం చేశారు...

